- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెనోపాజ్ దశలో ఆ లక్షణాలు.. ప్రోటీన్ లోపమే కారణమా?
శరీరానికి అవసరమైన హై-క్వాలిటీ ప్రోటీన్ లభించనప్పుడు హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. మెనోపాజ్ స్టేజ్‌లో మరింత సమస్యగా మారుతుంది.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా మెనోపాజ్ దశను అనుభవిస్తున్న స్త్రీలలో అధిక అలసట, ఎముకలు, కండరాల బలహీనత, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఇవి తరచుగా కొనసాగుతుంటే మాత్రం అధిక ప్రోటీన్ లోపంవల్ల కూడా కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 45 నుంచి 55 సంవత్సరాల మధ్య ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. ఇక ఈస్ట్రోజెన్ &ప్రొజెస్టెరాన్ హార్మోన్లు తగ్గడంవల్ల హాట్ ఫ్లాషెస్(hot flashes), రాత్రిళ్లు అధిక చెమటలు వంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ప్రోటీన్ లోపం వల్ల తలెత్తే ఇబ్బందులను దానిని అధిగమించడంవల్ల నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాలపై ప్రభావం
మెనోపాజ్ దశలో ప్రోటీన్ లోపం ఎక్కువైతే కండరాలు కోల్పోవడం (సార్కోపీనియా), జీవక్రియ మార్పులు ఎక్కువ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరానికి అవసరమైన హై-క్వాలిటీ ప్రోటీన్ తగినంతగా లభించనప్పుడు హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల మెనోపాజ్ లక్షణాలు మరింత తీవ్రం అవుతాయి. అంతేకాకుండా మెనోపాజ్ స్టేజ్‌లో తక్కువ ప్రోటీన్ లోపం కారణంగా జీవక్రియ, మెదడు సరైన పనినతీరు కోసం అమినో యాసిడ్స్‌పై డిపెండ్ అవుతాయి. దీంతో శక్తిస్థాయి తరచుగా పడిపోతుంది. సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్ల ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెరస్థాయిలు ఎక్కువై ఇర్రిటేబులిటీ, వణుకు, అతిగా స్వీట్స్ క్రేవింగ్స్ రావడం వంటివి జరుగుతాయి.
ఏం చేయాలి?
ప్రోటీన్ లోపాన్ని అధిగమించడం వల్ల మెనోపాజ్ దశలో వచ్చే తీవ్రమైన అనారోగ్య లక్షణాలను అధికమించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసం ప్రతీ భోజనంలో గుడ్లు, పాలు, కంది, మినప, శెనగ, మసూర్ వంటి పప్పులు, మాంసం, సోయా, నట్స్ వంటివి తప్పక చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రోటీన్లను అందించే అద్భుతమైన ఆహారాలు ఇవే. 50 కేజీల బరువు ఉన్న ఒక స్త్రీకి ప్రతిరోజూ సుమారు 50-60 గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుంది. కాబట్టి గుడ్లు (ప్రోటీన్ + హెల్తీ ఫ్యాట్స్), పాలు, పెరుగు, పన్నీర్, చీజ్, చికెన్, ఫిష్, మటన్, బాదం, వాల్‌నట్ వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరాన్ని బట్టి పోషకాహార లేదా వైద్య నిపుణులను సంప్రదించి తగిన డైట్ ఫాలో అవడంవల్ల మెనోపాజ్ దశలో సంభవించే పలు ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






