Health: స్ట్రెస్ అంటే ఓన్లీ స్ట్రెస్ మాత్రమే కాదు.. ఇంకా అది కూడా..!!

by Javid Pasha |

Health: స్ట్రెస్ అంటే ఓన్లీ స్ట్రెస్ మాత్రమే కాదు.. ఇంకా అది కూడా..!!

Health: స్ట్రెస్ అంటే ఓన్లీ స్ట్రెస్ మాత్రమే కాదు.. ఇంకా అది కూడా..!!
X

దిశ, ఫీచర్స్ : స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ (Stress, anxiety, depression)వంటివి సాధారణంగా మానసిక సమస్యలతో ముడిపడి ఉంటాయి అనుకుంటాం. కానీ ఫిజికల్ హెల్త్‌పై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి కాల క్రమేణా శరీరంలో పలు మార్పులకు దారితీస్తుందని, మెడ, భుజం, నడుము నొప్పులకు కారణం అవుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా ఏయే ప్రాబ్లమ్స్ తలెత్తుతాయో చూద్దాం.

దీర్ఘకాలిక ఒత్తిడి (Chronic stress) శరీరంలోని ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థను (Activates the stress response system) ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కార్టిసాల్, అడ్రినల్ వంటి హార్మోనల్ స్థాయిలు మరింత పెరుగుతాయి. అయితే శరీరంలో ఇవి అధికమైనప్పుడు సింపథెటిక్ (sympathetic) నాడీ వ్యవస్థను దీర్ఘకాలంపాటు యాక్టివ్‌గా ఉంచుతాయి. దీంతో శరీరంలో ఉద్రేక స్థితి ఏర్పడుతుంది. ఇదే తరచుగా మెడ, భుజాలు, నడుము నొప్పులకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

క్రానిక్ స్ట్రెస్ వల్ల కండరాలు, నరాలపై కూడా ఒత్తిడి పెరగుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో రక్తం ద్వారా కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. క్రమంగా రోగ నిరోధక శక్తి పడిపోవడం, పలు రకాల జబ్బులు, వ్యాధులు దాడిచేయడం ప్రారంభించవచ్చు. అందుకే స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story