Skin Care : ఆయిలీ స్కిన్‌తో ఆ సమస్యలు.. బయటపడే మార్గమిదే..

by Javid Pasha |

Skin Care : ఆయిలీ స్కిన్‌తో ఆ సమస్యలు.. బయటపడే మార్గమిదే..

Skin Care : ఆయిలీ స్కిన్‌తో ఆ సమస్యలు.. బయటపడే మార్గమిదే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఎక్కువ మంది చలికాలంలో స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కానీ ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాత్రం వేసవిలో ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే బయట తిరగంవల్ల, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కబోతలతో చెమటలు పట్టడం జిడ్డు చర్మం గలవారిని మరింత ఇబ్బంది పెడుతుంది. అలెర్జీలకు, శరీరంపై మంట, దురద, ఎర్రటి పొక్కులు వంటి సమస్యకు దారితీస్తుంది. అందుకే ఈ స్కిన్ టైప్ వారు వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్లెన్సింగ్ నుంచి మేకప్ వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే సమస్యలతో పాటు అంద విహీనంగా కనిపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అలా జరగకూడదంటే ఏం చేయాలో చూద్దాం.

*క్లీనింగ్ : ఎండ, వాన, చలి కాలమేదైనా ఆయిలీ స్కిన్ ఉన్నవారు మిగతా వారికంటే ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం, రాత్రి చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. అట్లనే బయటకు వెళ్లి వచ్చాక కూడా చల్లటి నీటితో ముఖం కడగాలి. దీనివల్ల ముఖంపై పేరుకుపోయిన మురికి, డస్ట్, జిడ్డు వంటివి తొలగిపోతాయి. అయితే ఎక్కువసార్లు సబ్బును వాడుతూ ముఖం కడగడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.

*క్లెన్సర్లు : ఆయిలీ స్కిన్ ఉన్నవారు క్లెన్సర్ లేదా సబ్బు విషయంలో చాలా కేర్ తీసుకోవాలంటున్నారు నిపుణులు. అధిక రసాయనలు ఉన్న ఫేస్ వాష్‌లు లేదా సోప్స్ యూజ్ చేయవద్దు. ఎందుకంటే ఇవి చర్మంపై ఉండే నేచురల్ ఆయిల్‌ను కూడా తొలగిస్తాయి. చర్మానికి హాని జరుగుతుంది. అయితే సహజమైన నూనెలు తొలగిపోకుండా నియంత్రించగల క్లెన్సర్లు యూజ్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు సెటాఫిల్ ఆయిలీ స్కిన్ క్లెన్సర్ జిడ్డు చర్మం ఉన్నవారికి మంచి ఎంపిక. అట్లనే పాలు, ముల్తానీ మట్టి, బొప్పాయి వంటివి క్లెన్సర్లుగా వర్క్ చేస్తాయట.

*మాయిశ్చరైజ్ : ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు సాధారణంగా మాయిశ్చరైజర్‌ను స్కిప్ చేస్తుంటారు. కానీ కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ముఖం క్లీన్ చేసుకున్నాక చర్మానికి తేమను చేకూర్చే చిట్కాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే తేమను కాపాడే మాయిశ్చరైజర్ జిడ్డు చర్మం గలవారికి కూడా అవసరం.

*సన్ స్క్రీన్ : మాయిశ్చరైజర్ వాడినప్పటికీ చర్మాన్ని కాపాడుకునేందుకు బయటకు వెళ్లినప్పుడు సన్ స్క్రీన్ లోషన్‌ను వాడటం అవసరం అంటున్నారు నిపుణులు. 50 ఎంటే ఎక్కువ ఎస్పీఎఫ్ సన్ స్క్రీన్ లోషన్ అయితే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎండవేడి, ముఖ్యంగా ఆల్ట్రావయొలెట్ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడటమే కాకుండా, చర్మం అదనపు నూనెలను తొలగించడానికి అది సహాయపడుతుంది. కాబట్టి వేసవిలో బయట తిరిగేవారు సన్ స్క్రీన్ వాడితే చర్మం పాడవకుండా ఉంటుంది. అట్లనే మేకప్, ఫేస్ ప్యాక్‌లు వేసుకునేటప్పుడు, తొలగించేటప్పుడు జిడ్డు చర్మతత్వం గలవారు. ముఖంపై జిడ్డును గ్రహించే టిష్యూలు లేదా బ్లాటింగ్ పేపర్లను యూజ్ చేయాలి. మేకప్ తొలగించేటప్పుడు కూడా ఇలానే చేయాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించగలరు.

Next Story