ఓవర్ థింకింగ్ కూడా మంచిదే..! ఆ విషయాల్లో మేలు చేస్తుందంటున్న నిపుణులు

by Javid Pasha |

ఓవర్ థింకింగ్ మౌఖిక వ్యక్తీకరణను మెరుగుపరుస్తుంది. అందుకే వీరు తమ ఆలోచనలను స్పష్టంగా, క్రమబద్ధంగా వ్యక్తపరచగలుగుతారు.

ఓవర్ థింకింగ్ కూడా మంచిదే..! ఆ విషయాల్లో మేలు చేస్తుందంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : అతి ఆలోచన లేదా ఆందోళన వాస్తవానికి అనారోగ్యంతో ముడిపడి ఉంటుంది. దీనివల్ల నెగెటివిటీ పెరిగి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వర్క్‌లో ప్రొడక్టివిటీ తగ్గుతుంది. కానీ ఒక అధ్యయనం మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలను వెల్లడించింది. ఓవథింగ్ (Overthinking is ), ఎక్స్‌క్యూజివ్(excessive worry) వర్రీస్ కూడా మానవులకు మేలు చేస్తాయని తెలిపింది. పైగా అతిగా ఆలోచించే వ్యక్తులు అధికస్థాయి తెలివితేటలు, విశ్లేషణాత్మక తార్కిక శక్తిని ప్రదర్శిస్తారని పేర్కొన్నది. ఆ వివరాలేమిటో చూద్దాం.

‘ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ డిజార్డర్స్’ పేరుతో 2015లో Alexander M. Penney సహా పలువురు మానసిక శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. అతి ఆలోచన మెదడులోని అలర్ట్‌నెస్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు సంబంధించిన ప్రాంతాన్ని యాక్టవేట్ చేస్తుంది. ఇది తెలివితేటలతో కూడిన కార్యాకలాపంతో సంబంధిం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ లక్షణం తరచూ అధిక మేధో సామర్థ్యంతో ముడిపడి ఉంటుంది. అందుకే అతిగా ఆలోచించే వ్యక్తులు సమస్యలను విశ్లేషించడంలో, పరిష్కరించడంలో, వివిధ కోణాల నుంచి పరిస్థితులను, సమాచారాన్ని లోతుగా పరిశీలించడంలో ఆసక్తి చూపుతారని అధ్యయనం పేర్కొన్నది.

అంతేకాకుండా ఈ ప్రక్రియ ఓవర్ థింకర్స్‌లో మౌఖిక వ్యక్తీకరణ(Improves verbal expression)ను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే వీరు తమ ఆలోచనలను స్పష్టంగా, క్రమబద్ధంగా వ్యక్తపరచగలుగుతారు. అంతేకాకుండా ఆందోళన, ఓవర్ థింకింగ్‌తో కూడిన వ్యక్తులు సాధారణంగా జాగ్రత్తగా ఉంటారు. ఇది వారికి ప్రమాదాలను ముందుగా గుర్తించడంలో, వాటిని నివారించడానికి వ్యూహాలు రచించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. Link

Next Story