Back pain : వెన్ను నొప్పికి ఇంటి చిట్కా.. తలదిండు లేకుండా ఆ యాంగిల్లో పడుకుంటే చాలు..

by Javid Pasha |

Back pain : వెన్ను నొప్పికి ఇంటి చిట్కా.. తలదిండు లేకుండా ఆ యాంగిల్లో పడుకుంటే చాలు..

Back pain : వెన్ను నొప్పికి ఇంటి చిట్కా.. తలదిండు లేకుండా ఆ యాంగిల్లో పడుకుంటే చాలు..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో వెన్నునొప్పి ఒకటి. చాలామంది బయటకు చెప్పుకోరు కానీ.. ఇదొక సైలెంట్ కిల్లర్‌లా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. నిశ్చల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, కాల్షియం, విటమిన్ల లోపం వంటివి ఇందుకు కారణం అవుతున్నాయి. సమస్య చిన్నదిగానే అనిపించినా ఆస్పత్రులకు వెళ్తే.. దాని తీవ్రతను బట్టి వేలల్లో ఖర్చు అవుతుంది. అయితే అలాంటి రిస్క్ లేకుండా ఇంటిలోనే పాటించదగ్గ చిట్కాలతో వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలాగో చూద్దాం.

చాలామందికి తలకింద దిండు వేసుకొని పడుకునే అలవాటు ఉంటుంది. ఒకవేళ మీరు వెన్ను నొప్పి(back pain)తో ఇబ్బంది పడుతుంటే గనుక దిండు వేసుకోకుండా పడుకుంటే ఐదారు రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు హెల్త్ అండ్ ఫిట్‌నెస్ నిపుణులు. ముఖ్యంగా బోర్లా పడుకునేవారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే.. దిండు లేకుండా పడుకోవడం వల్ల మెడ, వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ యాంగిల్ మెడను అసహజ కోణాలలో ఉంచకుండా నిరోధిస్తుంది. దీనివల్ల వెన్నెముక రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా మెడ, వెన్నెముక నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే దిండులేకుండా పడుకోవడం ఒక్కటే అన్ని వేళలా పరిష్కారం కాకపోవచ్చు. బోర్లా పడుకునే అలవాటు ఉన్నవారికి మాత్రం ఇది చక్కగా పనిచేస్తుంది. పక్కమీద, వెల్లకిలా పడుకునేవారికి సౌకర్యంగా అనిపించకపోవచ్చు. అలాంటప్పుడు తల, మెడ, వీపు భాగాలను సమాంతరంగా ఉంచే తక్కువ ఎత్తు కలిగిన సన్నని దిండును ఉపయోగించడం ఉత్తమం.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story