Fitness : పుష్ - అప్స్‌తో శక్తివంతమైన శరీరం.. బలం, ఆరోగ్యం, సౌలభ్యం కూడా..!

by Javid Pasha |   (  Updated:2025-09-06 12:46:54  IST  )

సగటు వ్యక్తి సాధారణంగా 20-30 పుష్- అప్‌లు మాత్రమే చేయగలడని, అది కూడా రెస్ట్ లేకుండా చేయడం కష్టమని నివేదికలు పేర్కొంటున్నాయి.

Fitness : పుష్ - అప్స్‌తో శక్తివంతమైన శరీరం.. బలం, ఆరోగ్యం, సౌలభ్యం కూడా..!
X

దిశ, ఫీచర్స్ : మీరు మరింత ఫిట్‌గా, హెల్తీగా ఉండటంలో ప్రతిరోజూ పుష్-అప్స్ చేయడం అద్భుతంగా సహాయపడుతుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది శరీర బరువుతో చేసే వ్యాయామం. ఛాతీ, భుజాలు, ట్రైసెప్స్, కోర్ కండరాలను బలోపేతం చేస్తుంది. అయితే ఇది అందరికీ ఒకేలా వర్తించదని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఇన్ని పుష్ - అప్స్ కచ్చితంగా చేయాలనేమీ లేదు. అయితే ఆయా వ్యక్తులు తమ శరీర బరువు, పొడవు, శక్తి సామర్థ్యాలను బట్టి ఎక్కువ లేదా తక్కువ పుష్-అప్స్ చేయవచ్చు.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (ACSM) వంటి సంస్థలు నిర్వహించిన అధ్యయనాలు, సగటు వ్యక్తి సాధారణంగా 20-30 పుష్- అప్‌లు మాత్రమే చేయగలడని, అది కూడా రెస్ట్ లేకుండా చేయడం కష్టమని పేర్కొంటున్నాయి. ఇలా చేసేవారు శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. అయితే 50 పుష్-అప్‌లు చేయగలిగిన వ్యక్తులు జనాభాలో 99% మంది కంటే బలంగా ఉంటారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సామర్థ్యం శారీరక దృఢత్వం, కండరాల బలం, శక్తి స్థాయిలను సూచిస్తుంది. అయితే ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం. అధిక పుషప్స్ చేయగలిగే బలాన్ని సాధించడానికి నిరంతర శిక్షణ, సరైన ఆహారం, శరీర సమతుల్యత అవసరం అంటున్నారు నిపుణులు.

పుష్ - అప్స్ వల్ల కలిగే ప్రయోజనాలు

* కండరాల బలోపేతం : పుష్-అప్‌లు ఛాతీ (Pectoral), భుజాలు (Deltoids), ట్రైసెప్స్, కోర్ కండరాలను బలపరుస్తాయి. ఇవి శరీర ఎగువ భాగంలో మరింత బలాన్ని, స్థిరత్వాన్ని పెంచుతాయి.

*గుండె ఆరోగ్యం : క్రమం తప్పకుండా పుష్ - అప్‌లు చేయడంవల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. గుండె- సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

*సహన శక్తి, సమతుల్యత : తరచుగా పుష్ - అప్స్ చేయడం సహన శక్తిని పెంచడమే కాకుండా, శరీర సమతుల్యతను, సమన్వయాన్ని మెరుగు పరుస్తుంది.

* ఎముకల ఆరోగ్యం : బరువును భరించే వ్యాయామంగా పుష్-అప్‌లు ఎముకల సాంద్రతను పెంచి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారిస్తాయి.

*మానసిక ఆరోగ్యం : పుష్ అప్ వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. మరో సౌలభ్యం ఏమిటంటే పుష్ అప్‌లకు ఎటువంటి పరికరాలు అవసరం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story