- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆసనంతో చెక్ పెట్టండిలా..!
హార్మోన్ల అసమతుల్యతవల్ల మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రుతుక్రమంలో అధిక రక్తస్రావం, తలపై జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

దిశ, ఫీచర్స్ : జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపాలు వంటి కారణాలతో శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బాడీలో చాలా ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. నిరంతరం అలసట, ఒత్తిడి, ఏకాగ్రత కుదరకపోవడం, విపరీతంగా చెమటలు పట్టడం, ఫేస్‌పై పింపుల్స్ రావడం, వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి సమస్యలు వేధిస్తాయి. అయితే వీటన్నింటికీ పైసా ఖర్చులేని ఒక చక్కటి పరిష్కారం ఉందంటున్నారు యోగా అండ్ ఫిట్‌నెస్ నిపుణులు. అదే సుప్త బద్ధ కోణాసనం.
హార్మోన్ల అసమతుల్యతవల్ల బాధితులు కొన్నిసార్లు తమకు తెలియకుండానే డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, ఆందోళన చెందడం వంటివి జరుగుతుంటాయి. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సంతానలేమి సమస్యలు, రుతుక్రమంలో అధిక రక్తస్రావం, అవాంఛిత రోమాలు, హెయిర్ ఊడిపోవడం వంటి లక్షణాలు కూడా మహిళల్లో కనిపిస్తాయి. అయితే ఇలాంటి సమస్యను ఎదుర్కొనే వారికి వైద్యపరమైన చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే సుప్త బద్ద కోణాసనం(Supta Badda Konasana) కూడా దీనికి చక్కటి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఎలా చేయాలనే విషయానికి వస్తే.. ముందుగా నేలపై నిటారుగా పడుకుని.. రెండు మోకాళ్లను పక్కలకు మడిచి, పాదాలను ఒకదానికి ఒకటి తాకించి ఉంచాలి. తర్వాత వాటిని బాడీవైపు తీసుకోచ్చేలా ఒత్తిడి చేయాలి. అలాగే అరచేతులు పైకి ఉంచి.. బ్యాక్ తీసుకెళ్లి నేలకు తాకించాలి. ఇప్పుడు మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదలాలి. ఇలా 10 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. ఈ ఆసనం వల్ల కేవలం హార్మోన్ల అసమతుల్యత మాత్రమే కాకుండా ఒత్తిడి తగ్గుతుంది. నాణ్యమైన నిద్రకు మేలు చేస్తుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా జరుగుతుంది.






