- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stress & habits : ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ పని ఇంకా చేయాలనిపిస్తుంది..! ఎందుకంటే..
Stress & habits : ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ పని ఇంకా చేయాలనిపిస్తుంది..! ఎందుకంటే..

దిశ, ఫీచర్స్ : తరచుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారికి అందుకు కారణమైన పరిస్థితి నుంచి దూరంగా ఉండాలనిపించడం సహజం. ఇది స్వీయ సంరక్షణలో భాగం. కానీ అదే పరిస్థితిలో ఉండే చాలా మందికి మరో పని కూడా ఎక్కువగా చేయాలనిపిస్తుంది. చివరకు అది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ పనేంటి? అనుకుంటున్నారా? పిజ్జా, బర్గర్, చిప్స్, అధికంగా నూనెలో వేయించిన స్పైసీ స్నాక్స్ వంటి రకరకాల జంక్ ఫుడ్స్‌పై మనసు లాగడం. సాధారణ వ్యక్తుల్లోకంటే స్ట్రెస్ అనుభవిస్తు్న్న వారిలోనే ఈ ఆసక్తి అధికంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందకు కారణమేంటో చూద్దాం.
*ఎమోషనల్ కనెక్షన్ : పోషకాహార నిపుణుల ప్రకారం.. ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం సహజంగానే సౌకర్యవంతమైన జంక్‌ఫుడ్స్‌ను కోరుకుంటుంది. అందుకు కారణం ఎమోషనల్ కనెక్షన్. అంటే జంక్‌ఫుడ్ తరచుగా దాని తాత్కాలిక రుచి వల్ల సంతోషకరమైన మెమోరీస్ లేదా భావోద్వేగ సౌలభ్యంతో ముడిపడి ఉంటుంది. అందుకే స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిగ్గా దానివైపు మొగ్గు చూపేలా ప్రభావితం చేస్తుంది.
డోపమైన్, సెరోటోనిన్ రిలీజ్ : నిపుణుల ప్రకారం జంక్ ఫుడ్ బ్రెయిన్‌లోని రివార్డ్ సెంటర్లను యాక్టివేట్ చేస్తుంది. దీంతో సంతోషానికి కారణమైన డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇది తాత్కాలిక ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. దీంతోపాటు అది తరచుగా అందుబాటులో ఉండే సౌలభ్యం, సౌకర్యం కూడా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం అధికంగా జంక్‌ఫుడ్ వైపు మొగ్గు చూపేందుకు దారితీస్తుంది. మరొక కారణం ఒత్తిడి హ్యాపీ హార్మోన్ అయిన సెరోటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలో జంక్ ఫుడ్, ముఖ్యంగా అధిక చక్కెరలు, కొవ్వులు కలిగిన ఆహారాలు తీసుకోవడం వాటి రుచి కారణంగా తాత్కాలికంగా సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. ఒత్తిడి నుంచి రిలీఫ్‌ను అందిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. ఇలాంటప్పుడు జంక్ ఫుడ్స్ తీసుకోవడం తక్షణ ఆనందాన్ని, ఎనర్జీని అందించిన అనుభూతిని కలిగిస్తాయి. దీంతో ఒత్తిడిలో ఉన్నప్పుడు వాటివైపు ఆసక్తి చూపుతారు.
*పర్యవసనాలు : జంక్ ఫుడ్స్‌లో అధిక కొవ్వులు, అధిక చక్కెర స్థాయిలు ఉంటాయి. ఒత్తిడికి గురైనప్పుడు వీటిని తినడం తాత్కాలిక ఆనందానికి, అనుభూతికి దారితీస్తుంది. కానీ తర్వాత ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. హై కొలెస్ట్రాల్ ఉండటంవల్ల జంక్ ఫుడ్ జీర్ణ వ్యవస్థలోని గట్ బ్యాక్టీరియా మనుగడకు అంతరాయం కలిగిస్తుంది. ఇది అనేక రోగాలకు దారితీస్తుంది. అంతేకాకుండా జంక్ ఫుడ్స్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలంపాటు పోషకాలకు దూరమై జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో ఒబేసిటీ, ఈటింగ్ డిజార్డర్లు పెరుగుతాయి. వీరు తరచుగా ఆందోళన, డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. ఇక శారీరక పరంగా అధిక రక్తపోటు, అధిక బరువు, మధుమేహం, రక్త నాళాల్లో ఆటంకాలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయని, నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఒత్తిడిలో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తినే అలవాటును దూరం చేయడానికి ప్రయత్నించాలి. అందుబాటులో అటువంటి ఆహారాలు, స్నాక్స్ ఉంచుకోవద్దు. అవి తినాలనిపించినప్పుడు పోషకాలు కలిగిన స్నాక్స్ తినాలి. అలాగే డైలీ వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






