- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Habits : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే చాలు.. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు
Habits : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే చాలు.. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు

దిశ, ఫీచర్స్ : ఉదయం లేవగానే కొందరు ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తుంటారు. మరికొందరు నీరసించి పోతుంటారు. వ్యక్తుల రోజువారి అలవాట్లే చాలా వరకు ఇందుకు దోహదం చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామాలు చేయడం, సరైన ఫుడ్ తీసుకోవడం వంటి మార్నింగ్ హాబిట్స్ ఆ రోజంతా యాక్టివ్‌గా ఉండటంలో సహాయపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.
* యోగా, మెడిటేషన్ : మీరు ఆ రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే మీ రోజువారి అలవాట్లలో యోగా లేదా మెడిటేషన్ కూడా తప్పక ఉండేలా చూసుకోండి. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కనీసం 15 నుంచి 30 నిమిషాలు ధ్యానం లేదా యోగా ప్రాక్టీస్ చేయడం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది.
* పోషకాహారం : మనల్ని ఎనర్జీటిక్‌గా ఉంచే మరో మార్నింగ్ హాబిట్ ఏంటంటే.. సరైన పోషకాహారం. ముఖ్యంగా ఉదయం మీరు చేసే బ్రేక్ ఫాస్ట్‌లో తగిన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే అందుకు తగిన శారీరక శ్రమ లేదా వ్యాయామాలు కూడా అవసరం. ముఖ్యంగా మీ రోజువారీ అల్పాహారంలో కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. యాపిల్స్, అరటిపండ్లు, ఓట్స్, ఎండు ఖర్జూరాలు, గుడ్లు వంటివి తప్పక ఉండేలా చూసుకోవడం మీలో ఎనర్జీకి దోహద పడతాయి.
*హైడ్రేటెడ్‌గా ఉండటం : చాలామంది ఉదయం లేచాక టిఫిన్ చేసేవరకు నీరు తాగరు. కానీ ఇది కొన్నిసార్లు నష్టం చేస్తుంది. కాబట్టి నిద్రలేచాక బ్రేక్ ఫాస్ట్ కంటే ముందుగా నీరు తాగడం కూడా అవసరం అంటున్నారు నిపుణులు. ఇది జీర్ణ వ్యవస్థను సక్రియం చేయడంలో సహాయపడుతుంది. అట్లనే రోజు మొత్తంలో కనీసం 8 నుంచి 10 గ్లాసుల వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి.
*ఫిజికల్ యాక్టివిటీస్ : ప్రతి రోజూ ఉదయం పూట కనీసం 30 నుంచి 40 నిమిషాల వరకు ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండేవారు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లేదా ఇతర వర్కౌట్స్ ఏవైనా చేయవచ్చు. ఉదయంపూట ఇలాంటి అలవాట్లే మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించి ప్రతిరోజూ ఎనర్జిటిక్‌గా ఉండేలా చేస్తాయి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






