- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐస్ వాటర్‌తో అద్భుతం.. ఇలా చేస్తే ఒత్తిడి, తలనొప్పి పరార్!
చల్లని ఐస్ వాటర్ వాగస్ నరాలను యాక్టివేట్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో తలనొప్పి, మైగ్రేన్ నొప్పి వంటివి సైతం తగ్గుతాయి.

దిశ, ఫీచర్స్ : అధిక ఒత్తిడి వల్లగానీ, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల గానీ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. రోజూ జర్నీ చేయడం, ఎక్కువ గంటలు పనిచేయడం ఇందుకు కారణం అవుతుంది. అయితే ఈ సమస్యకు పెద్దగా ఖర్చులేని చక్కటి పరిష్కారం ఒకటుంది అంటున్నారు నిపుణులు. ఏంటంటే.. ఐస్ వాటర్‌లో కాసేపు చేతులు పెట్టడం లేదా ఐస్ ముక్కలను నేరుగా కానీ, ఒక బట్టలో చుట్టి కానీ తల, మెడ, నుదురు, కళ్ల కింద, కను బొమ్మల పైభాగంలో సున్నితంగా మర్దన చేయడం. ఇలా చేస్తే కొద్ది నిమిషాల్లో స్ట్రెస్ రిలీఫ్‌తో పాటు తలనొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘Journal of Pain’లో పబ్లిషైన ఒక అధ్యయనం కూడా ఇదే పేర్కొన్నది.
మైగ్రేన్‌కు చెక్
వాస్తవానికి ఐస్ ఎక్స్‌పోజర్‌కు గురయ్యే ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందంటే.. చల్లని ఐస్ వాటర్ వాగస్ నరాలను యాక్టివేట్ చేస్తుంది. శరీరాన్ని శాంత పరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అదే సమయంలో కృతజ్ఞతాభావంతో సానుకూల విషయాలపై ఫోకస్ చేయడం, మనసును ప్రతికూల ఆలోచనల నుంచి డైవర్ట్ చేస్తుంది. ఈ రెండూ కలిపి తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా ఈ విధానం మెదడులో డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది హ్యాపీనెస్‌ను పెంచడంతోపాటు ఒత్తిడి హార్మోన్లను (కార్టిసాల్) తగ్గిస్తుంది. దీంతో తలనొప్పి, మైగ్రేన్ నొప్పి వంటివి సైతం తగ్గుతాయి.
మానసిక స్థితిలో మెరుగుదల..
ఐస్ వాటర్ ఒత్తిడి, తలనొప్పినే కాదు, రక్తనాళాలను సంకోచింపజేస్తూ సాధారణ మంటను సైతం తగ్గించడంలో సహాయపడతాయి. ఐస్ క్యూబ్స్ వాటర్‌లో వేసి, 5 నిమిషాలు చేతులు నీటిలో పెట్టడం లేదా నేరుగా ఐస్‌పై చేతులు ఆనించడం కూడా ఈ విధమైన ఫలితాన్ని ఇస్తాయి. శరీరం లేదా చేతులు ఐస్ వాటర్‌కు గురికావడం వల్ల శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఇది ఒత్తిడిని, తలనొప్పిని దూరం చేసి, మొత్తం మానసిక స్థితిని మెరుగు పరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






