- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health Tips : షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతున్నాయా? ఈ ఆహారాలు తప్పక తినండి !
Health Tips : షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతున్నాయా? ఈ ఆహారాలు తప్పక తినండి!

దిశ, ఫీచర్స్ : ఇటీవల అనేక మందిని వేధిస్తున్న సమస్యల్లో మధుమేహం(diabetes)ప్రధానంగా ఉంటోంది. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, అధిక ఒత్తిడి వంటివి కూడా ఇందుకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి వచ్చిందంటే డయాబెటిస్ పూర్తిగా నయం కాదు. కాబట్టి దానిని అదుపులో ఉంచుకోవడానికి రెగ్యులర్‌గా వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉపయోగపడే ఆహారాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో తప్పక తినాల్సిన వాటి గురించి తెలుసుకుందాం.
*పాలకూర : పాలకూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గ్లూకోజ్ నియంత్రణలో ఇది కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తప్పక తినాలంటున్నారు నిపుణులు. పైగా పాలకూరలోని పోషకాలు(Nutrients in lettuce) ఆహారంలోనిలోని గ్లూకోజ్‌ను రక్తంలో కలిసే సమయంలో ప్రభావితం చేయడం ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరగకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా ఇందులో పిండి పదార్థం లేకపోవడం, గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం కారణంగా గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
*టమాట : విటమిన్ సితోపాటు తక్కువ కేలరీలను కలిగి ఉండటంవల్ల టమాటాలు డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేస్తాయి. అందుకే ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవడం మంచిది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ ఎ ఉండటంవల్ల కంటి చూపు మెరుగువుతుంది. టమాటాల్లోని లైకోపీన్(Lycopen) సమ్మేళనం వల్ల మధుమేహంతోపాటు గుండె జబ్బులు, ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.
*బ్రోకలీ : కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే కూరగాయల్లో బ్రోకలీ (Broccoli)ఒకటి. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. విటమిన్ ఎ, సి, కె లు ఉంటాయి కాబట్టి, ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. అంతేకాకుండా ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు (Blood sugar levels)పెరగకుండా నిరోధిస్తుంది. బ్రోకలీలోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా డయాబెటిస్, గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తాయి. పైన పేర్కొన ఆహారాలతోపాటు ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవడం, అధిక చక్కెరలు, అధిక కేలరీలు(High calories) ఉన్నవాటిని తగ్గించడం చేయాలి. శరీర తత్వాన్ని బట్టి కొందరికి కొన్ని ఆహారాలు పడకపోవచ్చు. కాబట్టి వైద్య నిపుణుల సలహాలు పాటించాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






