Coding : కోడింగ్ ఇకముందు దేనికీ పనికి కాదు.. కొత్త స్కిల్స్ నేర్చుకోకుంటే కష్టమే !

by Javid Pasha |

Coding : కోడింగ్ ఇకముందు దేనికీ పనికి కాదు.. కొత్త స్కిల్స్ నేర్చుకోకుంటే కష్టమే !

Coding : కోడింగ్ ఇకముందు దేనికీ పనికి కాదు.. కొత్త స్కిల్స్ నేర్చుకోకుంటే కష్టమే !
X

దిశ, ఫీచర్స్ : సాఫ్ట్‌వేర్ కెరీర్‌పై ఆసక్తి ఉందా? ఐదంకెల జీతంతో కూడిన ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్నారా? ‘అయితే కోడింగ్ నేర్చుకోండి’ అని సలహా ఇస్తుంటారు చాలామంది. రూ. వేలల్లో మొదలుకొని లక్షలకొద్దీ సాలరీలు రావాలంటే కోడింగ్ నైపుణ్యాలు తప్పనిసరి అని సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా పేర్కొంటాయి. కానీ ఇకముందు కోడింగ్ ముఖ్యమైన కెరీర్ ఆప్షన్ కాకపోవచ్చునని సాంకేతిక నిపుణులు అంటున్నారు. టెక్నాలజీలో రోజు రోజుకు వస్తున్న ఆధునిక మార్పులే కారణమని చెబుతున్నారు.

కెరీర్ పరంగా ఒకప్పుడు కోడింగ్‌ను ‘గోల్డెన్ టికెట్’గా భావించేవారు. కానీ ఇకముందు అది పనికి రాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంప్రదాయ ప్రోగ్రామింగ్ ఉద్యోగాల డిమాండ్‌ను వేగంగా తగ్గిస్తుండటమే అందుకు కారణమని చెబుతున్నారు. వాస్తవానికి ఐదారేండ్ల క్రితం వరకు కోడింగ్ ఉన్నత జీవనానికి(For high living) మార్గంగా భావించబడింది. కానీ ఏఐ, ఛాట్ జీపీటీ వంటి మోడ్రన్ టెక్నాలజీ ప్రవేశం తర్వాత దాని అవసరం క్రమంగా తగ్గుతోంది. కోడింగ్‌కు ఏఐ ప్రత్యామ్నాయంగా మారుతోంది. దీంతో ఏఐ స్కిల్స్‌లేని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితులు సైతం నెలకొంటున్నాయి.

న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం.. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లలో, హ్యూమానిటీస్ గ్రాడ్యుయేట్‌ల కంటే కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఇది క్రమంగా టెక్ బూమ్ తగ్గుతుండటాన్ని సూచిస్తోంది. కాబట్టి మీరిప్పుడు మంచి ఉద్యోగం సంపాదించాలంటే నేర్చుకోవాల్సింది కోడింగ్ కాదు, ఏఐ స్కిల్స్ అంటున్నారు సాంకేతిక నిపుణులు. అయితే దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత టెక్ బబుల్ సమయంలో అర్హత లేని ప్రోగ్రామర్లు పుట్టుకొచ్చినట్లే.. ఇప్పుడు కొందరు ‘ఏఐ స్లాప్ కోడర్ల’ బూమ్ (creating momentum) క్రియేట్ చేస్తున్నారని విమర్శిస్తుననారు. అయిన్నప్పటికీ భవిష్యత్ మాత్రమే ఏఐ ఆధారిత స్కిల్స్‌పైనే ఆధారపడుతుందనే ప్రచారమే విస్తృతంగా జరుగుతోంది. చాలామంది దీనిని నమ్ముతున్నట్లు కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఏఐ ఆటోమేషన్ జాబ్ మార్కెట్‌ను మార్చేస్తున్న నేపథ్యంలో కోడింగ్ కనుమరుగు కావడం కాదనలేని వాస్తవమని కూడా నిపుణులు అంటున్నారు. అందుకే మారిన పరిస్థితులకు అనుగుణంగా కెరీర్ ఆప్షన్లు, సలహాలు, వ్యూహాలు పూర్తిగా పునర్మించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

LINK

Next Story