- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లూ.. వీళ్లూ కాదు.. మీరు కూడా..! సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా మారాలంటే ఇది తెలుసుకోవాల్సిందే..
నాకు అన్నీ తెలుసు.. నేనేదైనా చేయగలను.. జీవితానికి అసలైన అర్థం ఇదే.. అనుకునే వాళ్లెవ్వరూ నిజానికి ఆనందంగా, అద్భుతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండదు అంటున్నారు నిపుణులు.

దిశ, ఫీచర్స్ : మనతో పోలిస్తే వాళ్లు బాగున్నారు.. వాళ్ల జీవితం బాగుంది.. నూటికి 90 శాతం మంది ఇతరుల విషయంలో ఒక్కసారైనా ఇలా ఆలోచించకుండా ఉండలేరు! తాము తప్ప ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉన్నారని కూడా భావిస్తుంటారు. ఇలా ఇతరుల జీవితం గురించి ఆలోచిస్తూ.. అసలైన తమ జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది చాలామంది జీవితాల్లో అనేక విషయాల్లో ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. సంతోషాన్ని దూరం చేస్తుంది. మరి అలా జరగకూడదంటే ఏం చేయాలి? ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం చెబుతుంటారు కానీ.. ఫైనల్లీ మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు క్రియేట్ చేసుకోవడం మాత్రం మీచేతుల్లోనే ఉందని, అదే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుందని అంటున్నారు నిపుణులు. అందుకు సహాయపడే కొన్ని టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రతీరోజు నేర్చుకోండి
నాకు అన్నీ తెలుసు.. నేనేదైనా చేయగలను.. జీవితానికి అసలైన అర్థం ఇదే.. అనుకునే వాళ్లెవ్వరూ నిజానికి ఆనందంగా, అద్భుతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీరి ఆలోచనలు అంత వరకే పరిమితం చేస్తుంటారు. ఒక దగ్గర ఆగిపోవడంతో చివరికి నష్టపోతారు. అలా కాకుండా ఎంత తెలిసినా తెలియనివి ఉంటాయని గ్రహిస్తూ.. కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ అనుభవాల ద్వారా, అవగాహన ద్వారా, పరిశీలన ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం. వాటిలో వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి ఏది అవసరమో గుర్తిస్తూ.. ఆచరిస్తూ పోతే అదే మీ జీవితాన్ని ఆనందంగా, అద్భుతంగా మార్చేస్తుందని సక్సెస్‌ఫుల్ వ్యక్తులే చెబుతుంటారు.
నిరంతరం నేర్చుకోవడం
నేర్చుకోవడం ఒక విషయానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. అనేక రూపాల్లో, అనేక కోణాల్లో, అనేక మార్గాల్లో ఉంటుంది. సమాజం ద్వారా, కుటుంబం ద్వారా, పరిస్థితుల ద్వారా, పరిణామాల ద్వారా.. ఇలా ప్రతీది మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. ఏదో ఒక సందేశం ఇస్తుంది. కాకపోతే కొంచెం థింక్ చేస్తే గ్రహించగలుగుతాం. అలాగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి కూడా నిరంతరం నేర్చుకుంటూ ఉండాలంటారు నిపుణులు. పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవడం, ఉన్నతి స్థితికి చేరుకునే మార్గాలు అన్వేషించడం చేయాలి. రోజువారీ వ్యాయామాలు, వర్క్ షాప్‌లు, సమావేశాలు, వివిధ సందర్భాలు కూడా మీరు ఆనందంగా ఉండటానికి సహాయపడతాయి.
కృతజ్ఞతగా ఉండండి..
మీరు సక్సెస్ ఫుల్ పర్సన్‌గా మారాలంటే.. ఆ తర్వాత మిమ్మల్ని అందరూ గుర్తుంచుకోవాలంటే.. మీకు సహకరించిన వ్యక్తుల పట్ల, సమాజం పట్ల, పరిస్థితుల పట్ల కృతజ్ఞతగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలాంటి గ్రాటిట్యూడ్ మీలో పాజిటివిటీ పెంచుతుంది. అందుకే ఈ క్షణం నుంచే మీరు గ్రేట్ ఫుల్‌గా ఉండగలిగే విషయాలను గుర్తించండి. అవసరమైతే వాటిని నోట్ చేసుకోవడం ద్వారా ప్రారంభించండి. నిరాశ కలిగినప్పుడు, కోపంగా అనిపించినప్పుడు, ఒత్తిడిగా ఫీలైనప్పుడు వాటిని మరోసారి గుర్తు చేసుకోండి. ఆ మరు క్షణమే మీ మానసిక స్థితి మారిపోతుంది. సానుకూల ఆలోచనలతో సక్సెస్ వైపు అడుగులేస్తారు. ఆనందం మీ సొంతం అవుతుంది.
గొప్ప వ్యక్తులుగా.. సేవా భావంగా..
గొప్పగా ఉండటమంటే ఇక్కడ.. ఎక్కువ డబ్బు, పెద్ద పెద్ద హోదాలు కాదు.. మీ ఆలోచనలు, ఆచరణ గొప్పగా, ఆదర్శంగా, నలుగురి హానిచేయనిదిగా ఉండాలంటారు నిపుణులు. ఇలాంటప్పుడే మీరు నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారు. అయితే ఆ విధంగా జీవితాన్ని మల్చుకోవడంలో సేవా గుణం లేదా సేవా భావం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. మీరు చేసేది చిన్న పనే కావచ్చు. మాట పరంగా, డబ్బు పరంగా, సేవా పరంగా.. ఇలా రూపమేదైనా ఇతరులకు చేసే సాయం మీకు సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. జీవితాన్ని ఆనందంగా మల్చుకోవడంలో సహాయపడుతుంది.
డిజిటల్ డిటాక్స్‌తో జీవన సమతుల్యం
ఆధునిక సాంకేతికత మానవ జీవితాలను మార్చేస్తోంది. ఒక విధంగా అనేక విషయాలు డిజిటల్ మయం అవుతున్నాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ఒక ముఖ్యమైన అవసరంగా మారిపోయాయి. అలాగనీ దానిని దూరంగా పెట్టలేం. మరీ అడిక్ట్ అయినా నష్టమే. ఈ విషయంలో మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే ఆనందంగా ఉండగలుగుతారని, మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇది ఫాలో అవడం మస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్‌లో అయినా, ప్రొఫెషనల్ జీవితంలో అయినా ఎదగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా వినియోగించుకోగలగాలి. అలాగే అవసరమైనప్పుడు వాటిని పక్కన పెట్టగలగాలి. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లైఫ్, వర్క్ విషయంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలగాలి. అప్పుడు వాళ్లూ.. వీళ్లూ.. కాదు. సక్సెస్‌ఫుల్ జీవితాన్ని అనుభవించిన వ్యక్తుల లిస్టులో మీరు కూడా ఉంటారు.






