- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Coffee with music : కాఫీ సిప్ చేస్తూ.. మ్యూజిక్ వింటూ..
Coffee with music : కాఫీ సిప్ చేస్తూ.. మ్యూజిక్ వింటూ..

దిశ, ఫీచర్స్ : మీరు కాఫీ తాగుతూ మ్యూజిక్ వింటున్నారా..? ఆ తర్వాత చేసే పనిలో బెస్ట్ రిజల్ట్స్ రావచ్చు. మీ శక్తి, సామర్థ్యాలపై మీకే ఆశ్చర్యం కలగవచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితి మీ మానసిక స్థితిని మారుస్తుందని, మీలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల వర్క్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ కూడా పెరుగుతాయని కూడా పేర్కొన్నది. ఆయా సందర్భాల్లో సంగీతం వినడం, కప్ కాఫీ సిప్ చేయడం వంటి రోజువారీ ఆనందాలు మెదడును చురుగ్గా ఉంచడంవల్ల ఇలా జరుగుతుందని, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మ్యూజిక్ వినడం రోజువారీ పనులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి న్యూయార్క్ యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు చెందిన పరిశోధకులు ‘మైండ్ వాచ్’ అనే అత్యాధునిక బ్రెయిన్ మానిటరింగ్ టూల్‌ను ఉపయోగించారు. వాస్తవానికి ఇది మెదడు కార్యకలాపాలను ట్రాక్ చేసే ఓ ఆల్గారిథమ్. డైలీ రొటీన్స్‌కు మెదడు ఎలా రియాక్ట్ అవుతుందో అంచనా వేయడంలో సహాయపడుతుంది. కాబట్టి పరిశోధకులు వివిధ పనులను పరిశీలించేందుకు పలువురిని వీటిని ధరించాల్సిందిగా కోరారు. ఆ తర్వాత వారి బ్రెయిన్ పెర్ఫామెన్స్‌ను నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మిగతా సమయాలకంటే మ్యూజిక్ వింటున్నప్పుడు, కాఫీ సిప్ చేస్తున్నప్పుడు మెదడు మరింత చురుగ్గా పనిచేస్తున్నట్లు, హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ పరిస్థితి తర్వాత చేయబోయే పనుల్లో అధిక సామర్థ్యం కనబరిచేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా సంగీతం, కాఫీ రెండూ మూడ్ అండ్ ఎనర్జీ లెవెల్స్‌ను పెంపొందిస్తాయి. ఏకాగ్రతను, సృజనాత్మకతను పెంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇతరులతో కలిసి కాఫీ తాగడం మీలో ఉత్సాహాన్ని నింపుతుంది.






