Skin Care : చర్మం మెరిసిపోవాలా.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

by Javid Pasha |

Skin Care : చర్మం మెరిసిపోవాలా.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

Skin Care : చర్మం మెరిసిపోవాలా.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..
X

దిశ, ఫీచర్స్ : మనిషి శరీరంలోని లార్జెస్ట్ ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది స్కిన్. అయితే చర్మ సంరక్షణ అనేది ఆరోగ్యంతోపాటు, అందంతోనూ ముడిపడి ఉంటుంది. కాబట్టి చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు తమ స్కిన్ హెల్త్ కోసం, బ్యూటీ కోసం రకరకాల ఆహారాలు తినడం, మెడికేషన్ యూజ్ చేయడం, క్రీములు వాడటం చేస్తుంటారు. గుడ్డిగా ఇలా చేసినంత మాత్రాన సరిపోదు. మీ శరీర తత్వాన్ని (Skin type) దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు.

*చర్మం రకాలు : చర్మం అందరిలో ఒకే విధంగా ఉండదు. ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన చర్మ తత్వాన్ని లేదా రకాన్ని కలిగి ఉంటారు. ఆయా వ్యక్తుల జీవన శైలితోపాటు జన్యుశాస్త్రం, ఏజ్, హార్మోన్లు, ఒత్తిడి, ఆహారం, యాక్టివిటీ లెవెల్స్, ఎన్విరాన్ మెంటల్ ఫ్యాక్టర్స్ వంటివి ఇందులో కీలకపాత్ర పోషిస్తాయని అమెరికన్ అకాడెమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD) అధ్యయనం పేర్కొంటున్నది. దీని ప్రకారం.. పొడి చర్మం (oily), జిడ్డు చర్మం(oily), నార్మల్ స్కిన్, కాంబినేషన్ లేదా సెన్సిటివ్ స్కిన్.. ఇలా మొత్తం 5 రకాలు ఉన్నాయి.

* పొడి చర్మం : మీ శరీరంలో తగినంత సెబమ్‌ను(sebum) ఉత్పత్తి కానప్పుడు సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. దీనిని బట్టి మీది డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. నిజానికిది స్మాల్ ఫంగల్ వల్ల ఇది ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లకు కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్మ రకం ఉన్నప్పుడు సంరక్షణ కోసం తేమగా ఉంచుకోవడం ముఖ్యం. అందుకోసం ఒక సున్నితమైన క్లెన్సర్ అండ్ హ్యూమెక్టెంట్స్ కలిగి ఉండే మాయిశ్చరైజర్‌ని చూజ్ చేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.

*జిడ్డు చర్మ : ఆయిలీ స్కిన్ టైప్ కలిగి ఉన్నట్లయితే సెబమ్ (జిడ్డు) అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల స్వేద గ్రంధులు విస్తరిస్తాయి. ఇది మెరుస్తున్న జిడ్డు చర్మానికి దారితీస్తుంది. కొన్నిసార్లు స్వేద రంధ్రాలు మూసుకుపోయి మెటిమలు ఏర్పడి సమస్యగా మారతుంటాయి. ఇలాంటి చర్మ సంరక్షణ కోసం బెంజాయిల్ పెరాక్సైడ్ లేదా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేషియల్ క్లెన్సర్‌ను యూజ్ చేయడం ముఖ్యం. అలాగే ‘‘నాన్ కామెడోజెనిక్’’ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం కూడా ప్రయత్నించవచ్చు. మరొక విషయం ఏంటంటే.. జిడ్డు చర్మ రకం ఉన్నవారు వ్యాయామాలు చేసిన తర్వాత వెంటనే తలస్నానం చేయడం వల్ల మొటిమలు, దద్దుర్లు వంటివి రాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇక దీంతోపాటు కాంబినేషన్ స్కిన్ టైప్, నార్మల్ స్కిన్ టైప్, సెన్సిటివ్ స్కిన్ టైప్ అని పలు రకాల చర్మ తత్వాలు ఉంటాయని నిపుణులు చెబతున్నారు. వీటి గురించి అవగాహన లేకుండా అందం కోసం క్రీములు వాడితే కొన్నిసార్లు అవి అలర్జీలకు, ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. అందుకే జర జాగ్రత్త.

*మిమ్మల్ని మీరు విశ్వసించండి : కొందరు తమ చర్మ తత్వం గురించి ఎక్కువ ఆందోళన చెందుతుంటారు. ఆన్‌లైన్‌లో స్కిన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన రకరకాల కంటెంట్, స్కిన్ కేర్ రొటీన్స్ చూస్తున్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఏది సెలెక్ట్ చేసుకోవాలోనని అనుమాన పడుతుంటారు. అయితే మీ స్కిన్ కలర్ ఏదైనా, దాని రకం గురించి తెలిసి ఉన్నప్పుడు, స్కిన్ మీద మీకు ప్రేమ, శ్రద్ధ ఉన్నప్పుడు ఆందోళన అవసరం లేదంటున్నారు నిపుణఉలు. క్వాలిటీ స్లీప్, హైడ్రేటెడ్‌గా ఉండటం, వ్యాయామం, ఒత్తిడిని మేనేజ్ చేయడం వంటి అంశాలు మీ చర్మ తత్వాన్ని, ఓవరాల్ స్కిన్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి చర్మ సంరక్షణ, అందం విషయంలో అనుమానాలు ఉంటే ముందుగా చర్మ వ్యాధి నిపుణులు సలహాలు, సూచనలు పాటించడం బెటర్.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story