- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meditation : ఆ పనికోసం రోజూ 5 నిమిషాలు కేటాయించండి చాలు.. అద్భుతమే ఇక..
Meditation : ఆ పనికోసం రోజూ 5 నిమిషాలు కేటాయించండి చాలు.. అద్భుతమే ఇక..

దిశ, ఫీచర్స్ : నిరంతరం ఏదో హడావిడి.. ఓ వైపు ఉద్యోగ బాధ్యలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఇంకోవైపు కుటుంబ సమస్యలు. నెల తిరిగే సరికి అప్పుల బాధలు.. అనారోగ్యాలతో చెప్పుకోలేని అవస్థలు.. ఎందుకిలా తయారవుతున్నాడు మనిషి.. ఒక్క నిమిషం తన గురించి తాను ఆలోచించుకుంటే ఇన్ని తంటాలు ఉండవు కదా.. కానీ ఏం చేస్తాం.. సమాజంలో అవసరం అలాంటిది. బతకాలంటే అందరితోపాటు పరుగెత్తాల్సిందే. పోటీ ప్రపంచంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. జీవన సమరంలో ఓటమి తప్పదు. అట్లని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అందమైన క్షణాలనీ కోల్పోతూ బతకాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. నిరంతరం ఒత్తిడి, ఆందోళనలు, సమస్యలు, సవాళ్లు మిమ్మల్ని వెంటాడుతుంటే.. మీ మానసిక ఆనందాన్ని హరిస్తుంటే.. అలసత్వం వద్దు. ప్రతి రోజూ 5 నిమిషాలు ఆ పనికోసం కేటాయించండి చాలు అంటున్నారు. ఇంతకీ ఆ పనేంటిఅంటారా? మెడిటేషన్. దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.
బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది
ఒత్తిడి ఆందోళనలు తగ్గడమే కాదు, రోజూ 5 నిమిషాలు మెడిటేషన్ చేయడంవల్ల బ్లడ్ ప్రెజర్ (బీపీ) కూడా తగ్గుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. ఎందుకంటే మెడిటేషన్ వల్ల శరీరం ఒత్తిడి హార్మోన్లకు తక్కువగా రియాక్ట్ అవుతుంది. నరాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. అంతేకాకుండా మెడిటేషన్ ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.
ప్రశాంతమైన నిద్రకు
నిద్రలేమి ఎన్ని సమస్యలకు దారితీస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. తలనొప్పి, మైగ్రేన్, డిప్రెషన్ వంటివి ముందుగా నిద్రలేమితోనే ప్రారంభం అవుతాయి. కాగా మెడిటేషన్ చేయడంవల్ల ఇలాంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం అలా వీలు కాకపోతే.. కనీసం నిద్రకు ముందు అయినా సరే ఓ 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. నిద్ర చక్కగా పడుతుంది. అది మీలో మానసి ఆనందానికి కారణం అవుతుంది. క్వాలిటీ స్లీప్‌ను ప్రేరేపించడంలో మెడిటేషన్ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ క్రియ ఆరోగ్యంతోపాటు..
మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి పరోక్షంగా మీ జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. స్ట్రెస్ వల్ల నిద్రలేమి, ఆకలిలేకపోవడం వంటివి సంభవిస్తాయి. శరీరంలో వాపు, యాసిడ్ రిఫ్లెక్షన్స్, అజీర్తి, పేగుల్లో పుండ్లు, ఫుడ్ అలెర్జీలు కూడా ఏర్పడవచ్చు. అట్లనే వాంతులు, విరేచనాలు వంటివి ఒత్తిడి మూలంగా పెరిగే జీర్ణక్రియ సమస్యలుగానూ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే.. ముందు జాగ్రత్తగా మీరు మెడిటేషన్ చేస్తూ ఉండండి అంటున్నారు నిపుణులు. మెడిటేషన్ అంటే మరేదో కాదు, శ్వాస మీద ధ్యాస.. మీరు దేవుడిని నమ్మేవారైతే మీ ఇష్టమైన దేవున్ని ధ్యానిస్తూ మెడిటేషన్ చేయవచ్చు. నమ్మనివారైతే అందమైన ప్రకృతి, పారేయేరు, పూసే పూలు, ఎగురుతున్న పక్షులు, సముద్రపు అలలు, తీయటి జ్ఞాపకాలు ఇలా మీకు నచ్చిన అంశంపై మనసు లగ్నం చేస్తూ మెడిటేషన్ చేయవచ్చు. దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ.. నెమ్మదిగా వదులుతూ.. మనసును కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నమే మెడిటేషన్. ఇది మీకు నిజమైన ఆంనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






