Mental health : పదే పదే ఆ ఆలోచనలు వస్తున్నాయా..? కారణమిదేనేమో!

by Javid Pasha |   (  Updated:2025-01-31 15:34:23  IST  )

Mental health : పదే పదే ఆ ఆలోచనలు వస్తున్నాయా..? కారణమిదేనేమో!

Mental health : పదే పదే ఆ ఆలోచనలు వస్తున్నాయా..? కారణమిదేనేమో!
X

దిశ, ఫీచర్స్ : ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వారు కూడా కొన్నిసార్లు ఏవేవో ఆలోచిస్తూ ఆందోళన చెందుతుంటారు. అనవసర విషయాలకు సైతం ఫోకస్ చేస్తూ బాధపడుతుంటారు. క్షణం కూడా కుదురుగా ఉండలేకపోతారు. ఏదో కోల్పోయిన అనుభూతి వారిని వెంటాడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా తమకు ఎటువంటి అనారోగ్యం లేకపోయినా శరీరంలో ఏదో జరుగుతోందని, ఏదైనా జబ్బు వచ్చి ఉండవచ్చునని భ్రమపడుతుంటారు. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఖర్చు పెడుతుంటారు. కానీ ఎటువంటి రోగాలు ఉండవు. ఇలాంటి అరుదైన మానసిక సమస్యనే ‘హైపోకాండ్రియా’గా పేర్కొంటున్నారు మానసిక నిపుణులు.

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిపోయింది. కొందరైతే సోషల్ మీడియాలోనో, వివిధ సమాచా మాధ్యమాల్లోనో వచ్చే హెల్త్ ఆర్టికల్స్ చదవడం, భద్రపర్చుకోవడం చేస్తుంటారు. ఇంకొందరు ఆరోగ్యానికి సంబంధించి కొంగొత్త విషయాలను తెలుసుకోవాలని గూగుల్ సెర్చ్ చేస్తుంటారు. అయితే కొందరు అతిగా సెర్చ్ చేయడం, అతిగా చదవడం, తాము చదివిన ప్రతీ అనుమానిత హెల్త్ రిలేటెడ్ సమాచారాన్ని, అందులోని లక్షణాలను తమకు ఆపాదించుకోవడం చేస్తుంటారు. ఇది క్రమంగా అధిక ఆందోళనకు తద్వారా హైపోకాండ్రియా అనే మానసిక రుగ్మతకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో ఏ వ్యాధి లేకపోయినప్పటికీ ఏదో ఉందని ఊహించుకోవడం, భ్రమ పడటం, పదే పదే లేనిపోని రోగాల గురించి ఆలోచిస్తూ కుంగిపోవడం చేస్తుంటారు.

హైపోకాండ్రియాసిస్ స్థితిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా క్యాన్సర్ లేదా ఇతర జబ్బులతో మరణిస్తే, తమకూ అలాగే జరుగుతుందేమోనని భయపడుతుంటారు. కాబట్టి ముందు జాగ్రత్తగా హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతుంటారు. నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారు. ఇలా బాధితుల్లో ఒక సమస్య అయిపోయాక మరో సమస్యపై దృష్టి మరలుతుంది. దీంతో చివరకు డిప్రెషన్‌కు లోనవుతుంటారు కొందరు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా ఉందనే గట్టిగా నమ్మే మనస్తత్వం కారణంగా ఇలా జరుగుతుంది కాబట్టి డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటాని నిపుణులు అంటన్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించగానే బాధితులు మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమమని, కౌన్సెలింగ్ లేదా ఎక్స్ పోజర్ థెరపీల ద్వారా వారు దీనిని నయం చేస్తారని పేర్కొంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Read Also..

ఫీవర్ వచ్చినప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే..

Next Story