ఫీవర్ వచ్చినప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే..

జ్వరం వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో తప్పులు చేస్తే అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జ్వరం సమయంలో ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీవర్ వచ్చినప్పుడు చల్లటి నీటితో స్నానం చేయడం, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ వంటి చల్లని పదార్థాలను తినడం చాలా ప్రమాదకరం. ఇది శరీర ఉష్ణోగ్రతను అకస్మాత్తుగా తగ్గించి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.
జ్వరం సమయంలో ఎక్కువ పని చేయడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్‌పై పోరాడే శక్తిని కోల్పోతుంది.
జ్వరం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి బలహీన పడి సమస్య ఎక్కువ అవుతుంది.
జ్వరం వచ్చిన వెంటనే వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా మందులు వేసుకోవడం చాలా ప్రమాదకరమైన విషయం.
అలాగే ఏం కాదని కొన్ని మందులు తీసుకోవడం వల్ల అనుకోని దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది.
జ్వరాన్ని చిన్న సమస్యగా భావించి లైట్ తీసుకోవడం అంత మంచిది కాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది..
సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోకుండా పనిలో నిమగ్నమవ్వడం వల్ల జ్వరం తీవ్రత పెరిగి మరింత సమస్యకు దారితీస్తుంది.