- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంబంధాల్లో ప్రేమ, బాధ, భావోద్వేగం.. అసలు రహస్యం ఇదే..!!
ఒక వ్యక్తి మెదడులో ప్రేమ, భావోద్వేగాలు వంటి ఫీలింగ్స్ ప్రాసెస్ అవుతున్నప్పుడు వాటిని మేనేజ్ చేయడంలో సహాయపడే హార్మోన్లలో ఆక్సిటోసిన్ ముఖ్యమైనది.

దిశ, ఫీచర్స్ : మాటల్లో, చేతల్లో, మనుషుల ప్రవర్తనల్లో ఆయా సందర్భాలను బట్టి బాధ, ప్రేమ, ఆకర్షణ, అసూయ, సంతోషం వంటి భావాలు, భావోద్వేగాలు వ్యక్తం అవుతుంటాయి. అయితే ఈ మానవ లక్షణల వెనుక హార్మోన్లు కీ రోల్ పోషిస్తాయన్న సంగతి మీకు తెలుసా? శాస్త్రవేత్తలు అదే చెబుతున్నారు. ప్రతీ భావోద్వేగం వెనుక ఏదో హార్మోన్ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నప్పుడు, అలాగే బ్రేకప్ అయినప్పుడు, బాధలో మునిగిపోయినప్పుడు సదరు వ్యక్తి శరీరంలో జరిగే పలు మార్పులకు ఇవి కారణం అవుతుంటాయి. ఇంతకీ ఏ హార్మోన్లు ఏ విధమైన ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
*ఆక్సిటోసిన్ : ఒక వ్యక్తి మెదడులో ప్రేమ, భావోద్వేగాలు వంటి ఫీలింగ్స్ ప్రాసెస్ అవుతున్నప్పుడు వాటిని మేనేజ్ చేయడంలో సహాయపడే హార్మోన్లలో ఆక్సిటోసిన్ ముఖ్యమైనది. దీనిని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. సంబంధాలు, ప్రేమ, నమ్మకం, గౌరవం, ఓపీనియన్ వంటి అంశాల్లో ఇది కీ రోల్ పోషిస్తుంది.
*డొపమైన్ : ఇది బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. మనం ఇష్టపడే వ్యక్తులతో ఉన్నప్పుడు ఆనందాన్ని, భరోసాను, సురక్షిత భావాలను కలిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి భావాలను దూరం చేస్తుంది. మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది.
*వాసోప్రెసిన్ : ఇష్టమైన వ్యక్తులపట్ల ఆసక్తిని క్రియేట్ చేయడంలో ప్రేరణగా నిలిచే హార్మోన్ వాసోప్రెసిన్. ఎగ్జైట్మెంట్ భావాలను, ప్రియమైన వారిపట్ల ప్రొటెక్షన్, లాయల్టీ వంటి ఫీలింగ్స్‌ను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో అసూయ భావాలకు కూడా ఇదే కారణం అవుతుంది.
*టెస్టో స్టెరాన్, ఈస్ట్రోజెన్: ఈ హార్మోన్లను సెక్స్ హార్మోన్లు అని కూడా పిలుస్తారు. రిలేషన్‌షిప్‌లో కీలకపాత్ర పోషిస్తాయి. స్ట్రీ, పురుషుల మధ్య స్టార్టింగ్ స్టేజ్‌లో ఆకర్షణకు కారణం అవుతాయి. లైంగిక పరమైన కోరికలకు, భావాలకు ప్రేరణగా నిలుస్తాయి.
*నోరాడ్రినలిన్ : శరీరంలో జరిగే మార్పులకు, ప్రతిస్పందనలకు నోరాడ్రినలిన్ హార్మోన్ కీలకం. గుండె వేగంగా కొట్టుకోవడం, చేతలకు చెమటలు పట్టడం, అత్యంత ఇష్టమైన వారిని కలిసినప్పుడు ఎనర్జిటిక్‌గా ఫీలవ్వడం వంటివి భావాలు ఈ హార్మోన్ విడుదల కారణంగా సంభవిస్తాయని నిపుణులు అంటున్నారు.
*సెరోటోనిన్ : రిలేషన్‌షిప్‌లో, ముఖ్యంగా అటాచ్‌మెంట్ ప్రవర్తనలో కీ రోల్ పోషిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇది తగ్గినప్పుడు.. నిర్లక్ష్య ధోరణి వంటి ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. లో సెరోటోనిన్ లెవెల్స్ (Low serotonin levels) ఒక విధంగా అబ్సెసివ్ - కంపల్సివ్ డిజార్డర్ (OCD) వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. కాకపోతే ఇవి సంబంధంలో మంచి విషయంగా ఉంటాయి. అంటే ఇద్దరూ తమ బంధానికి సంబంధించిన అంశంపై ఎక్కువ ఫోకస్ చేస్తారు.






