- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొంతులో కఫం వేధిస్తోందా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు
కఫం చేరడంవల్ల చిన్న పిల్లలు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది

దిశ, ఫీచర్స్ : వర్షాలు కురుస్తుండటం, చల్లటి వాతావరణం కారణంగా ఇటీవల చాలా మంది సీజనల్ వ్యాధులతోపాటు గొంతు నొప్పి, గొంతులో గరగర, కఫం చేరడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కఫం చేరడంవల్ల చిన్న పిల్లలు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే పలు హోమ్ రెమిడీస్‌తో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అందుకోసం పలు చిట్కాలను సూచిస్తున్నారు.
గొంతులో కఫం చేరడంవల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. శ్వాస తీసుకోవడంలో, ఆహారం మింగడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. తరచూ దగ్గు వస్తూ ఉంటుంది. ఈ సమస్య పోవాలంటే కఫాన్ని నివారించాలి. అందుకోసం ఒక ఉల్లిపాయను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోని రసం సేకరించి, కొంచెం స్వచ్ఛమైన తేనెను మిక్స్‌చేసి తాగాలి. ఇలా చేయడంవల్ల ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, తేనెలో ఉండే ఇమ్యూనిటీ పవర్ కఫాన్ని తగ్గిస్తాయి. మరో చిట్కా ఏమిటంటే.. ఒక గ్లాస్ వాటర్‌లో కొన్ని పుదీనా ఆకులు వేసి, బాగా మరిగించి, వడబోసుకోవాలి. తర్వాత ఆ నీటిలో కొద్దిగా నిమ్మ రసం కలిపి సేవిస్తే గొంతులో కఫం తగ్గిపోతుంది. దీంతోపాటు మరో రెమిడీ ఏంటంటే.. ఒక గిన్నెలో కొన్ని మెంతులు, నాలుగైదు లవంగాలు వేసి లైట్‌గా వేయించాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్‌లో వీటిని చుట్టి. గొంతు, మెడపై భాగాలపై కాపడంవల్ల కూడా కఫం తగ్గుతుంది. కఫం సమస్య వేధిస్తున్నవారు అది తగ్గే వరకు మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్, ఆయిల్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వాటర్ ఎక్కువగా తాగాలి.






