మీ ఫోన్‌లో ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నారా? ఈ నష్టాలు జరగొచ్చు జాగ్రత్త!

by Javid Pasha |   (  Updated:2026-03-03 10:16:12  IST  )

రోజువారీగా ఉపయోగించే చాలా యాప్‌లు ఫొటోలకు, వీడియోలకు ఫుల్ యాక్సెస్ అడుగుతుంటాయి. చాలామంది ఇచ్చేస్తుంటారు కూడా. కానీ దీనివల్ల పలు నష్టాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

మీ ఫోన్‌లో ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నారా? ఈ నష్టాలు జరగొచ్చు జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : కొత్త ఫోన్ కొన్నప్పుడో లేదా అప్‌డేట్ చేస్తున్నప్పుడో కొన్ని యాప్‌లు, ముఖ్యంగా సోషల్ మీడియా ఎడిటింగ్ టూల్స్ మీ ఫోన్‌లోని ఫొటోలకు, వీడియోలకు ఫుల్ యాక్సెస్ అడగడం మీరెప్పుడైనా గమనించారా? ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలంటున్నారు ప్రైవసీ ఎక్స్‌పర్ట్స్. ఫుల్ యాక్సెస్ ఇవ్వకపోవడమే మంచిదని చెబుతున్నారు. అలా చేయడంవల్ల హానికరమైన యాప్‌లు మీ ఎంటైర్ కెమెరా రోల్‌ను చూసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు? అలా జరగకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

మిస్‌యూజ్ కావచ్చు

మీరు రోజువారీగా ఉపయోగించే చాలా యాప్‌లు ఫొటోలకు, వీడియోలకు ఫుల్ యాక్సెస్ అడుగుతుంటాయి. చాలామంది ఇచ్చేస్తుంటారు కూడా. కానీ దీనివల్ల పలు నష్టాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫోన్‌లోని స్టోరేజ్, పర్సనల్ మెమరీలు, పాస్‌పోర్ట్ క్రెడిట్ కార్డ్ ఫొటోలు, సెన్సిటివ్ డాక్యుమెంట్లు కూడా ఉంటాయి. కాబట్టి ఫుల్‌పర్మిన్ ఇవ్వడంవల్ల కొన్ని మాలిషియస్ యాప్‌లు అకస్మాత్తుగా వాటిని క్యాప్చర్ చేయడం, వేరే నెట్వర్కులోకి అప్‌లోడ్ చేయడం చేయవచ్చు అంటున్నారు నిపుణులు. అంటే ఇక్కడ హానికరమైన యాప్‌లు మీ సమాచారాన్ని మిస్‌యూజ్ చేయవచ్చు.

సెలెక్టెడ్‌ యాక్సెస్ బెటర్..

మాలిషియస్ యాప్‌లు మీ ఫోన్ గ్యాలరీని స్కాన్ చేసి, క్రిప్టో వాలెట్ రికవరీ ఫ్రేజ్‌లు లేదా ఐడెంటిటీ ప్రూఫ్‌లను హంట్ చేస్తాయి. ఒకవేళ దీనివల్ల డేటా లీక్ అయితే స్కామర్లు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తారని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు మెటా(ఫేస్‌బుక్ ) వంటి కంపెనీలు ఫొటోలను ఏఐతో అనలైజ్ చేసి ట్రాకింగ్ చేస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ యాక్సెస్ ఇస్తే యాప్ బ్యాక్‌గ్రౌండ్ డేటా కలెక్ట్ చేసి, మార్కెటింగ్ లేదా సర్వైలెన్స్‌కు ఉపయోగించవచ్చు. కాబట్టి ప్రైవసీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నట్లు సెలెక్టెడ్ ఫొటోస్‌కు యాక్సెస్ లేదా లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వడం బెటర్. దీనివల్ల మీ ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, ఇంకేదైనా సమాచారం అకస్మాత్తుగా అప్‌లోడ్ అవ్వడం ఆగిపోతుంది. మాలిషియస్ ఇంటెంట్‌ను నిరోధిస్తుంది. ప్రస్తుతం ఐవోఎస్(iOS), ఆండ్రాయిడ్ (Android)లలో ఇలాంటి ఆప్షన్ ఉంది. కాబట్టి ఫుల్ యాక్సెస్‌కు బదులు ‘Select Photos’ ఎంచుకోవడం ఎంచుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.

ఫుల్ యాక్సెస్ వల్ల కలిగే నష్టాలు

*సెన్సిటివ్&పర్సనల్ డేటా ఎక్స్‌పోజర్ : సాధారణంగా ఫోన్ గ్యాలరీలో పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్/డెబిట్ కార్డ్ ఫోటోలు, క్రిప్టో వాలెట్ రికవరీ ఫ్రేజ్ స్క్రీన్‌షాట్స్, ప్రైవేట్ మెమరీలు వంటివి సేవ్ చేసి పెడుతుంటారు చాలామంది. ఆయా యాప్‌లకు ఫుల్ యాక్సెస్ ఇస్తే.. హానికరమైన యాప్స్ మీ సమాచారాన్ని స్కాన్ చేసి దొంగిలించే అవకాశం ఉంది 2023లో మాలిషియస్ యాప్‌లు ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

*అకస్మాత్తుగా అప్‌లోడ్ అయ్యేచాన్స్ : హానికరమైన యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో మీ అన్ని ఫోటోలను సర్వర్‌కు అప్‌లోడ్ చేయవచ్చు లేదా ఏఐతో అనలైజ్ చేయవచ్చు. మీరు ఒక ఫోటో మాత్రమే షేర్ చేయాలనుకున్నా, అనుకోకుండా ఇతర సెన్సిటివ్ ఫోటోలు కూడా వెళ్లిపోయే రిస్క్ ఉంటుంది.

*మాలిషియస్ యాప్‌ల ద్వారా డేటా చోరీ : అన్‌ ట్రస్టెడ్ లేదా మాలిషియస్ యాప్‌లు (Like fake editing apps) గ్యాలరీని స్కాన్ చేసి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను దొంగిలిస్తాయి. దీంతో ఐడెంటిటీ థెఫ్ట్, బ్లాక్ మెయిల్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగే అవకాశం పెరుగుతుంది.

*ప్రైవసీ లాస్ అండ్ ట్రాకింగ్ : కొన్ని టెక్ కంపెనీలు (మెటా వంటివి) మీ ఫొటోలను ఏఐ‌తో అనలైజ్ చేసి మీ ఫేషియ్ ఫీచర్స్, లైఫ్ స్టైల్ ట్రాక్ చేసి టార్గెటెడ్ యాడ్స్ లేదా డేటాను సేల్ చేసే రిస్క్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా డేటా లీక్ అయితే మీ పర్సనల్ మెమరీలు పబ్లిక్ డొమైన్‌లోకి వెళ్లే రిస్క్ ఉంటుంది.

*థర్డ్-పార్టీ షేరింగ్: యాప్ కంపెనీలు మీ డేటాను పోలీస్ లేదా ఇతర థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు. ఉదాహరణకు కొన్ని కేసుల్లో ప్రైవేట్ ఫొటోలు, మెసేజ్‌లు షేర్ అయిన ఉదాహరణలు ఉన్నాయి. దీంతో మీ ప్రైవైసీ దెబ్బతింటుంది.

*ఐడెంటిటీ థెఫ్ట్ &ఫైనాన్షియల్ రిస్క్ : సెన్సిటివ్ డాక్యుమెంట్ ఫొటోలు దొంగిలిస్తే హ్యాకర్లు మీ బ్యాంక్ అకౌంట్స్, సోషల్ మీడియా, ఇతర అకౌంట్స్ హ్యాక్ చేయడానికి ఉపయోగించవచ్చు. అందుకే ఎక్స్‌పర్ట్స్ (Electronic Frontier Foundation వంటివారు) లిమిటెడ్ యాక్సెస్(Select photos only) ఇవ్వమని సలహా ఇస్తు్న్నారు.

Next Story