- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gardening : గార్డెనింగ్‌తో ఆనందం.. ఆరోగ్యం.. ఇంకా..
Gardening : గార్డెనింగ్‌తో ఆనందం.. ఆరోగ్యం.. ఇంకా..

దిశ, ఫీచర్స్ : వ్యాయామాలు చేయడానికి సమయం దొరకడం లేదా? ఒత్తిడితో సతమతం అవుతున్నారా? అయితే వీలైన సమయాల్లోనో లేదా సెలవు రోజుల్లోనో గార్డెనింగ్‌లో పాల్గొనండి.. మానసిక ఆనందంతోపాటు ఆరోగ్యానికీ మంచిది అంటున్నారు నిపుణులు. నిజానికి నేటి ఉరుకుల, పరుగుల జీవితం కొన్ని సమస్యలకు కారణం అవుతోంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీనికితోడు కుటుంబం, ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమై ఉండే వారు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు గార్డెనింగ్ కూడా అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతున్న ఒత్తిడి
ఇటీవల చాలామంది మిలీనియల్స్ (28 నుంచి 43 ఏళ్లలోపు వయస్సుగలవారు) రోజువారీ జీవితంలోని ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా గార్డెనింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఇదొక ఫేవరెట్ అవుట్‌లెట్‌గా మారుతోంది. మట్టి, అలాగే రకరకాల మొక్కల మధ్య ఈతరం వర్క్ చేయడమంటే కేవలం మొక్కల పెంపకం కోసం మాత్రమే కాదు. సదరు వ్యక్తుల సొంత మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలోనూ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నేలను చదును చేయడం, విత్తనాలు లేదా మొక్కలు నాటడం, నచ్చిన డిజైనింగ్‌లో కట్ చేయడం, తరచూ పచ్చదనం మధ్య గడపడం వంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఇటు శారీరక, ఆటు మానసిక ఆరోగ్యాలకు మేలు చేకూరుస్తున్నాయి.
ప్రకృతితో కనెక్ట్
ప్రత్యేకించి మొక్కల(Succulents) మెయింటెనెన్స్, అక్కడి వెదర్ తోటపనిలో పాల్గొనే వారికి ఎంతో ఆనందాన్నిస్తుంది. తోటపనిలో నిమగ్నం కావడంవల్ల స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటివి దూరం అవుతాయని అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. మొక్కలు నాటడానికి లేదా గార్డెనింగ్ క్లీన్ చేయడానికి మట్టిని త్రవ్వడం వల్ల, ఆ మట్టి వాసనతో సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్ మిటర్ హార్మోన్ రిలీజ్ అవుతుందని, ఇది మానసిక ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గార్డెనింగ్‌లో టైమ్ స్పెండ్ చేయడంవల్ల సహజమైన సూర్యకాంతికి గురవుతారు. విటమిన్ డి సహజంగానే లభిస్తుంది. ఇది మానసిక శ్రేయస్సుకు ఎంతో ముఖ్యం. ఒక విధంగా చెప్పాలంటే ఇతర శారీరక వ్యాయామాలవల్ల కలిగే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు గార్డెనింగ్ వల్ల కూడా కలుగుతాయి. అదనంగా ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి, కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్, గుండెజబ్బులు వంటివి రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.






