Health : నెలసరి సమయంలో ఆ సమస్యలు.. ఈ గింజల పొడితో పరార్!

by Javid Pasha |

అవిసె గింజల్లో లిగ్నాన్స్ అనే మొక్క ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి. ఇవి హార్మోన్లలో హెచ్చు తగ్గులను క్రమబద్ధీకరిస్తాయి.

Health : నెలసరి సమయంలో ఆ సమస్యలు.. ఈ గింజల పొడితో పరార్!
X

దిశ, ఫీచర్స్ : మహిళలు తరచుగా ఎదుర్కొనే సమస్యల్లో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. అయితే కొన్ని రోజువారీ ఆహారాల ద్వారా కూడా కొంతకాలానికి ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. హార్మోన్ల సమతుల్యత రీసెట్ అవుతుంది. అలాంటి వాటిలో అవిసె గింజలు(Flax Seeds) కూడా ఒకటి. వీటిని తీసుకోవడంవల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కడుపు నొప్పి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతయాని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటివల్ల పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

*అవిసె గింజల్లో లిగ్నాన్స్(Lignans) అనే మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ లాగా పనిచేస్తూ హార్మోన్ల హెచ్చు తగ్గులను సహజంగానే క్రమబద్ధీకరిస్తాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఒమేగా -4 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో వాపును (Inflammation) తగ్గించి, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని దూరం చేస్తాయి.

*ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రించి , హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. పీరియడ్స్ సమయానికి వచ్చేలా తోడ్పడతాయి. అంతేకాకుండా పీరియడ్స్‌కు ముందు వచ్చే మూడ్ స్వింగ్స్, చిరాకును తగ్గిస్తాయి. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిర్లు, కడుపు నొప్పిని నివారిస్తాయి.

*చర్మం కాంతివంతంగా మారడానికి, జుట్టు, గోళ్లు దృఢంగా ఉండటానికి అవిసె గింజల్లోని పోషకాలు సహాయపడతాయి. నెలసరి సమయంలో వచ్చే నిద్రలేమిని దూరం చేస్తాయి. థైరాయిడ్&అడ్రినల్ గ్రంథుల పనితీరును మెరుగు పరుస్తాయి.

ఎలా తీసుకోవాలి?

*రోజూ 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల పొడిని స్మూతీస్‌లో కలుపుకోవచ్చు. అలాగే ఓట్స్ లేదా పెరుగుపైనా చల్లుకోవచ్చు. రొట్టెలు లేదా పిండివంటల్లో కలిపి వాడుకోవచ్చు. ప్రతి రోజూ నీటిలో కొంచెం నిమ్మరసం, అవిసెపొడి కలిపి కూడా తాగవచ్చు. సలాడ్లు లేదా సూప్‌లలో వేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అవిసె గింజలను ఎప్పుడూ పొడిరూపంలోనే తీసుకోవాలి. నేరుగా తింటే అవి సరిగ్గా అరగవని, వాటిలోపి పోషకాలు, ప్రయోజనాలు శరీరానికి సరిగ్గా అందవని నిపుణులు చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story