బీరు + చేప సూపర్ హెల్తీ.. ఆల్కహాల్ జీరో అయితే మాత్రమే!

by Javid Pasha |   (  Updated:2025-11-21 12:31:15  IST  )

నాన్ ఆల్కహాలిక్ బీరు తక్కువ కేలరీలను కలిగి ఉండటంతోపాటు జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చేప(fish)తో కలిపి తీసుకోవడం సూపర్ కాంబో మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది.

బీరు + చేప సూపర్ హెల్తీ.. ఆల్కహాల్ జీరో అయితే మాత్రమే!
X

దిశ,ఫీచర్స్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాలిక్ బీర్లు ప్రమాదకరం. కానీ నాన్ ఆల్కహాలిక్ బీరు(Version with 0.0% alcohol) మాత్రం మంచే చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. పైగా సాధారణ బీరుతో పోలిస్తే చాలా తక్కువ కేలరీలు(Only 20–30 calories per 100 ml) ఉంటాయి. అయినప్పటికీ B-విటమిన్లు (B1, B2, B3, B6, B9) పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు హాప్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజంని సపోర్ట్ చేసి, దీర్ఘకాలంలో బరువు నియంత్రణకు సహాయపడవచ్చు. న్యూట్రియెంట్ జర్నల్(Nutrients Journal, PMC9824297)లో పబ్లిషైన గత పరిశోధనలు కూడా నాన్ ఆల్కహాలిక్ బీరు వల్ల నష్టం లేదని తేల్చాయి.

నాన్ ఆల్కహాలిక్ బీరు తక్కువ కేలరీలను కలిగి ఉండటంతోపాటు జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక ఈ బీరును చేప(fish)తో కలిపి తీసుకోవడం సూపర్ కాంబో మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, విటమిన్ D, అయోడిన్, సెలీనియం వంటివన్నీ కలిపి చర్మం మెరుగ్గా ఉండేలా, రోగనిరోధక శక్తి పెరిగేలా, ఎనర్జీ లెవెల్స్ హైగా ఉండేలా చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. రుచిగా, ఆరోగ్యంగా, గిల్ట్ ఫ్రీగా ఒక పర్ఫెక్ట్ మీల్!.. కానీ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది కేవలం నాన్-ఆల్కహాలిక్ బీరుకి మాత్రమే వర్తిస్తుంది. సాధారణ బీరులో ఆల్కహాల్ ఎక్కువగా ఉండటంతో కేలరీలు, లివర్ లోడ్ రెండూ పెరుగుతాయి. అందుకే ఇలాంటి నాన్-ఆల్కహాలిక్ బీరు + ఫిష్ కాంబోని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవడం బెస్ట్ అంటున్నారు పోషకాహార నిపుణులు. రోజూ తాగేస్తే మళ్లీ అదే పాత సమస్యలు మొదలవుతాయి జాగ్రత్త!

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story