- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Emotions : ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారా..? జరభద్రం.. శరీరంలోని ఈ అవయవాలు పాడయ్యే చాన్స్..!
Emotions : ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారా..? జరభద్రం.. శరీరంలోని ఈ అవయవాలు పాడయ్యే చాన్స్..!

దిశ, ఫీచర్స్ : మీరు ప్రతీ దానికి అతిగా ఎమోషనల్ అవుతుంటారా? అయితే జర భద్రం. ఎందుకంటే భావోద్వేగాలు కేవలం మనసు వరకే పరిమితం కావు. అవి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆందోళన(Anxiety), కోపం, దుఃఖం, భయం వంటివి శరీరంలోని వివిధ అవయవాలను రిస్క్‌లో పడేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏ భావోద్వేగం, ఏయే అవయవాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆందోళనతో గుండెకు రిస్క్
తీవ్రమైన భావోద్వేగాల్లో చాలామంది ఆందోళన (Anxiety)కు గురవుతుంటారు. నిరంతర ఒత్తిడి, ఆత్రుతతో కూడిన మానసిక స్థితివల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇది శరీరంలోకార్టిసాల్, అడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. ఇవి గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ పెరగవచ్చు. అంతేకాదు దీర్ఘకాలిక ఆందోళన వల్ల గుండె కండరాలు బలహీనపడతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ లేదా అరిథ్మియా వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఆందోళనను నియంత్రించడానికి ధ్యానం(meditation), శ్వాస వ్యాయామాలు(Breathing exercises) వంటివి ఉపయోగపడతాయి. ప్రతీదానికి అతిగా ఎమోషనల్ అవడాన్ని నివారించాలని కూడా నిపుణులు చెబుతున్నారు.
కోపం లివర్‌కు ప్రమాదం
కోపం అనేది ఒక శక్తివంతమైన భావోద్వేగంగా నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో అడ్రినలిన్, అలాగే నోరాడ్రినలిన్ వంటి హార్మోన్ల రిలీజ్‌కు కారణం అవుతుంది. ఇవి కాలేయం(liver)పై ఒత్తిడిని కలిగిస్తాయి. ఎందుకంటే లివర్ శరీరంలోని విష పదార్థాల(Toxic substances)ను ఫిల్టర్ చేయడంలో, హార్మోన్లను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నిరంతర కోపంతో కూడిన భావోద్వేగం కాలేయంలో రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. ఇది ఫ్యాటీ లివర్, హెపటైటిస్, లేదా సిర్రోసిస్ వంటి సమస్యల రిస్క్‌ను పెంచుతుంది. సాంప్రదాయ చైనీస్ వైద్యంలో కూడా కోపాన్ని లివర్ హెల్త్‌తో ముడిపెట్టి చూస్తారు. కోపాన్ని కంట్రోల్ చేయడానికి యోగా, ఇతర వ్యాయామాలు, సానుకూల ఆలోచనలు సహాయపడతాయి.
దుఃఖంతో ఊపిరితిత్తులకు నష్టం
దుఃఖం లేదా విచారం అనేది లోతైన భావోద్వేగం. ఇది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలిక దుఃఖం శ్వాస సమస్యల(Breathing problems)ను తీవ్రతరం చేస్తుంది. ఎందుకంటే ఇది శ్వాసను నిస్సారంగా, బలహీనంగా మార్చడం ద్వారా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. ఇది ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి ఊపిరితిత్తుల సమస్యల(Lung problems)ను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. దుఃఖాన్ని ఎదుర్కోవడానికి గ్రూప్ థెరపీ, మెడిటేషన్, పాజిటివ్ యాక్టివిటీస్, పాజిటివ్ థాట్స్ వంటివి ఉపయోగపడతాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
భయంతో కిడ్నీలు డ్యామేజ్
భయమనేది ఒక తీవ్రమైన భావోద్వేగంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది శరీరంలో ‘ఫైట్ లేదా ఫ్లైట్’ రియాక్షన్‌ను రేకెత్తిస్తుంది. అయితే తరచుగా భయానక ఆలోచనలు రావడం, భయానక పరిస్థితుల్లో జీవించడం వంటి భావోద్వేగాలు మూత్రపిండాలపపై అధిక ఒత్తిడిని పెంచుతాయి. అంతేకాకుండా నిరంతర భయంవల్ల స్ట్రెస్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి మూత్రపిండాల రక్త ప్రసరణను, వడపోత విధానాన్ని దెబ్బతీస్తాయి. దీర్ఘకాలం కొనసాగితే కిడ్నీ వైఫల్యం లేదా కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అనవసర భయాన్ని తగ్గించడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్, మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్, సరైన ఆహార నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు. కాబట్టి అతి భావోద్వేగ పరిస్థితులను నివారించాలని, మానసిక ఆరోగ్యాన్ని సైతం జాగ్రత్తగా మేనేజ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించ లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






