Fitness : వ్యాయామంతో శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. ఈ బెనిఫిట్స్ కూడా..!

by Javid Pasha |

ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఎండోర్ఫిన్స్అం, బ్రెయిన్-డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ వంటి ముఖ్యమైన న్యూరోకెమికల్స్ విడుదల అవుతాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

Fitness : వ్యాయామంతో శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. ఈ బెనిఫిట్స్ కూడా..!
X

దిశ, ఫీచర్స్ : వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్కిప్పింగ్.. పేరు ఏదైతేనేం వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. కానీ చాలా మందికి తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. ఏంటంటే.. ఎక్సర్‌సైజ్‌లు కేవలం శారీరక ఆరగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి సైతం శక్తివంతమైన సాధనంగా ఉంటూ అనేక ప్రయోజనాలు కల్పిస్తాయని ‘ఫ్రంటియర్స్ ఇన్ బిహేవియరల్ న్యూరోసైన్స్’లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. దీని ప్రకారం తరచుగా వ్యాయామం చేసే అలవాడు మెదడులో జ్ఞాపక శక్తి, ఒత్తిడి నియంత్రణలకు సంబంధించిన ప్రాంతాలను ప్రేరేపిస్తుంది. దీంతో మతిమరుపు సమస్య రాకుండా ఉంటుంది.

ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఎండోర్ఫిన్స్ అండ్ BDNF (బ్రెయిన్-డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్) వంటి ముఖ్యమైన న్యూరోకెమికల్స్ విడుదల అవుతాయి. వీటిలో ఎండోర్ఫిన్స్ సంతోషాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఇక బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరో ట్రోఫిక్ ఫ్యాక్టర్స్ అయితే మెదడు తనను తాను పునర్నిర్మించుకోవడానికి (న్యూరోప్లాస్టిసిటీ) సహాయపడతాయి. ఈ ప్రాసెస్ వల్ల ట్రామా రిలేటెడ్ ఆలోచనలను సైతం దూరం చేయడంలో సహాయపడి మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే వ్యాయామం మానసిక ఒత్తిడి నుండి బయటపడేందుకు ఒక సహజ మార్గమని నిపుణులు చెబుతున్నారు. శారీరక వ్యాయామాలే కాకుండా యోగా, మెడిటేషన్, ప్రకృతిలో ప్రశాంతంగా గడపడం వంటివి కూడా మానసిక స్థితిని మెరుగు పరుస్తాయి. స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. Link

Next Story