- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : నడకలో తేడా..? శరీరంలో ఏదో జరుగుతుందని అర్థం !
Health : నడకలో తేడా..? శరీరంలో ఏదో జరుగుతుందని అర్థం!

దిశ, ఫీచర్స్ : ఉదయం నడుస్తున్నప్పుడు ఓ క్షణంపాటు కళ్లు బైర్లు కమ్మి సాధారణ స్థితికి వస్తున్నారా? ఏదో తెలియని ఆందోళన, అలసటతో నీరసించిపోతున్నారా? నడకలో తేడా, మాటలో తడబాటు కనిపిస్తోందా? అయితే బీకేర్ ఫుల్.. ఎందుకంటే ఇది మీ శరీరంలో డయాబెటిస్ ప్రారంభమైందనే లక్షణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఇంకా ఏయే లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం.
*మధుమేహం.. నిజానికిది బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ లోపం లేదా అసమతుల్యతవల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య. ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. పూర్తిగా నివారించే ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం అందుబాటులో లేదు. కాబట్టి కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తారు. అయితే ఇది శరీరంలో ప్రారంభమయ్యే ముందు కనిపించే లక్షణాలను గుర్తిస్తే ముందు జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా నడకలో ఈ సంకేతాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
*అనుకోకుండా నీరసం : మీరు నెమ్మదిగా వాకింగ్ చేస్తున్నాసరే అనుకోకుండా అధిక అలసటకు గురవుతారు. నీరసించిపోతారు. శరీరమంతా బలహీనంగా అనిపిస్తుంది. ఇవన్నీ మీ శరీరంలో డయాబెటిస్ ప్రారంభ సంకేతాలు కావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. రక్తంలో చక్కెరస్థఆయిలు అధికంగా ఉన్నప్పుడు బాడీసెల్స్ ఎనర్జీకోసం గ్లూకోజ్‌ను ఉపయోగించుకోలేవు. దీంతో తగినంత శక్తి అందక ఈ పరిస్థితి సంభవిస్తుంది. తరచుగా ఇలాగే అనిపిస్తుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి షుగర్ టెస్టులు చేయించుకోవడం ద్వారా అలర్ట్ కావచ్చు అంటున్నారు నిపుణులు.
*కాళ్లల్లో జర్క్ : నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా కాళ్లల్లో జర్క్ వస్తుంది. ఒక్కోసారి ఈ విధమైన తిమ్మిరితో కొన్ని క్షణాలు నడవడానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. దీంతోపాటు నొప్పి, జలదరింపులు వంటివి నడకవేళలో కనిపిస్తుంటే బీ అలర్ట్. అది మధుమేహ సంకేతమే. శరీరంలో ఇన్సులిన్ వినియోగంలో యాక్టివ్‌నెస్ కోల్పోవడంవల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి ఇలా జరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు.
*బ్రీతింగ్ ఇష్యూస్ : ఫిజికల్ యాక్టివిటీస్‌లో నిమగ్నమైనప్పుడు, నడుస్తున్నప్పుడు, ఒక్కోసారి సాధారణ సమయాల్లో కూడా శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బంది తలెత్తుతుంది. ఒకటికి రెండుసార్లు ఇలా జరిగితే అనుమానించాల్సిందే. ఏమో అది డయాబెటిస్ వల్ల కూడా కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే మరింత అధికం కావచ్చు. తెలుసు కదా మధుమేహం ముదిరితే గుండెపై, లంగ్స్‌పై మరింత స్ట్రెస్ పెరుగుతుంది. ఇదే బ్రీతింగ్ ఇష్యూస్‌ను పెంచుతుంది.
*కాళ్లల్లో వాపు, నొప్పి : మీరు హెల్తీగానే ఉన్నా అప్పుడప్పుడు కాళ్లు వాచినట్లు, కొద్దిపాటి నొప్పి వంటి ప్రాబ్లమ్స్ వచ్చిపోతున్నాయా? జర భద్రం. ఇది కూడా మీ శరీరంలో డయాబెటిస్ ప్రారంభ సంకేతమే అంటున్నారు వైద్య నిపుణులు. ఇది స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు నడకవేళ పాదాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడంవల్ల ఏర్పడే పరిస్థితి. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






