- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
palli chikki : డోంట్ వర్రీ.. పల్లీ పట్టి తింటే ఆ సమస్యలన్నీ పరార్ !
Pally Chikki : డోంట్ వర్రీ.. పల్లీ పట్టి తింటే ఆ సమస్యలన్నీ పరార్ !

దిశ, ఫీచర్స్ : పల్లీ పట్టీ (Pally Chikki) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానమ్మల కాలం నాటి తినుబండారం అంటారు కానీ.. అందులో ఆరోగ్యానికి మేలు చేసే దమ్ముందని కూడా చెబుతుంటారు నిపుణులు. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ఎవరైనా తినగలిగే ఈ ఆహారం అలసటను, శారీరక బలహీతను దూరం చేస్తుంది. ఇంకెన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిస్తుంది. అవేంటంటే..
*పల్లీ పట్టీలో ఐరన్ కంటెంట్ అధికం. కాబట్టి ఇది రక్తహీనతను దూరం చేసే అద్భుతమైన ఆహారం. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు తినాలని చెబుతుంటారు. ఎందుకంటే మన దేశంలో రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నది వీరే ఎక్కువ. చిక్కీ తినడంవల్ల అధిక అలసట, నీరసం వంటివి రాకుండా ఉంటాయి.
*పిల్లలు చిక్కీ తింటే మెదడు ఆరోగ్యానికీ మేలు చేస్తుందట. ముఖ్యంగా జ్ఞాపక శక్తి (memory power), ఏకాగ్రత పెరుగుతాయని, చదువుల్లో రాణించేందుకు ఇది అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పల్లీ పట్టీలో థయామిన్, ఫాస్పరస్, నియాసిన్ వంటి పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. బాలింతలు, గర్భిణులు, పిల్లల ఆరోగ్యానికి పల్లీ పట్టీలు చాలా మంచిది. రక్తహీనతను, అనారోగ్యాలను దూరం చేస్తాయి.
*పల్లీ పట్టీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-inflammatory) గుణాలు అధికం. విటమిన్ ఇ, సి, జింక్ కూడా ఉంటాయి. అందుకే చర్మ సంరక్షణకు ఇవి అవసరం. తరచుగా తింటే చర్మ సౌందర్యం కూడా పెరుగుతుందని పెద్దలు చెప్తుంటారు. విటమిన్ ఇ వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియాలు, వైరస్‌ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అందుకే పల్లీ పట్టీ తినాలంటారు.
*చిక్కీలో బెల్లం (jaggery) కూడా వాడుతారు. ఇందులో ఐరన్ అధికం. ఇందులోని ఇతర పోషకాలు కూడా రక్తాన్ని శుద్ధి చేయడంలో, జీర్ణ క్రియ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. ప్రొటీన్, గుడ్ కొలెస్ట్రాల్, ఫైబర్ కూడా ఉండటంవల్ల బెల్లం పట్టీలు లేదా పల్లీ పట్టీలు పిల్లలు, పెద్దల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేరు శనగలో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలను నివారించగల పోషకాలు ఉంటాయి. కాబట్టి చిక్కీలు తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అంటున్నారు పోషకాహార నిపుణులు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






