- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health tips : సమ్మర్‌లో ఈ పదార్థాలను వేడి చేసి తింటున్నారా..? మీ ఆరోగ్యం రిస్క్‌లో పడ్డట్టే..!
Health tips : సమ్మర్‌లో ఈ పదార్థాలను వేడి చేసి తింటున్నారా..? మీ ఆరోగ్యం రిస్క్‌లో పడ్డట్టే..!

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ అవసరం మేరకు ఆహారం తినాల్సిందే. ముఖ్యంగా పోషకాలు కలిగిన వాటిపై ఫోకస్ చేయాలంటారు నిపుణులు. అయితే చాలా వరకు ఆహారాలను, పానీయాలను వండుకొని, కొన్నింటిని వండిన తర్వాత వేడి చేసుకొని తినడం, తాగడం చేస్తుంటాం. కాగా తిరిగి వేడిచేసి(Reheating)తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. అదెలాగో చూద్దామా!
*టీ(Tea) : మనలో ప్రతి ఒక్కరికి టీ తాగే అలవాటు దాదాపు ఉంటుంది. అయితే కొందరు ఉదయంపూట ఒకేసారి ఎక్కువ మొత్తంలో టీ చేసి సాయంత్రం, అవసరమైతే రాత్రికి కూడా తాగుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే టీని రీహీట్ చేసి తాగితే శరీరంలో టానిన్స్ వంటి సమ్మేళనాలను డెవలప్ చేస్తుంది. ఇవి చేదుగా మారి కడుపులో ఉబ్బరం, నొప్పి, గ్యాస్ వంటి సమస్యలకు, నిద్రలేమికి దారితీస్తాయి.
*బీట్‌రూట్ (Beetroot) : బీట్ రూట్‌ను ఒక సారి వండాక తిరిగి వేడిచేయడంవల్ల అందులో నైట్రేట్లు కొన్నిసార్లు నైట్రో సమైన్స్ వంటి హానికారక సమ్మేళనాలను ప్రొడ్యూస్ చేస్తాయి. ముఖ్యంగా వేడి చేసినప్పుడు ఇలా జరుగుతుంది. అందుకే బీట్ రూట్‌ను ఒకసారి వండినాక తిరిగి వేడిచేసి తినకూడదు.
*అన్నం (Rice) : అన్నం కూడా అంతే. ఒకసారి వండాక తిరిగి వేడి చేసి తినకూడం ప్రమాదకరం. చద్దన్నం తిన్నా ఏం కాదు. కానీ వేడిచేసి తింటే రిస్కులో పడ్డట్టే. ఎందుకంటే అలా చేయడంవల్ల అందులోని బాసిలస్ సెరియస్ అనే బ్యాక్టీరియా విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*పుట్ట గొడుగులు (Mushrooms): పుట్ట గొడుగులను ఒకసారి వండాక మళ్లీ తినేటప్పుడు తిరిగి వేడిచేయడం వల్ల ప్రొటీన్లు విచ్ఛిన్నవుతాయి. తర్వాత వీటిని ఆహారంగా ఉపయోగిస్తే అజీర్తి, ఉబ్బరం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని కూరగా వండినప్పుడు వెంటనే రిఫ్రిజిరేటర్లో గానీ, చల్లటిప్రదేశంలో గానీ ఉంచాలి. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతవల్ల కూడా పుట్ట గొడుగుల్లో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
*ఇలా చేయండి : చాలా వరకు ఆహారాలను వేడిచేసి తినకూడదు. అలా చేస్తే ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే చాన్స్ ఉంటుంది. కాబట్టి తాజాగానే తినాలి. ఇక స్టోర్ చేయాల్సి వస్తే వండిన రెండు గంటల్లోగా రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయండి. ఆ తర్వాత తినాల్సి వచ్చినప్పుడు కూడా అదే తినండి. కానీ వేడి చేయకూడదు అంటన్నారు ఆరోగ్య నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






