Bitter Gourd : వామ్మో.. కాకర కాయలో ఇన్ని పోషకాలా..?

by Javid Pasha |

Bitter Gourd : వామ్మో.. కాకర కాయలో ఇన్ని పోషకాలా..?

Bitter Gourd : వామ్మో.. కాకర కాయలో ఇన్ని పోషకాలా..?
X

దిశ, ఫీచర్స్ : కూరగాయల్లో కాకర కాయ గురించి అందరికీ తెలిసిందే.. రుచికి కాస్త చేదుగా ఉంటుంది కానీ.. పోషకాలు, ఔషధ గుణాలు ఫుల్లుగా ఉంటాయి. ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇందులోని పోషకాలు సహాయపడతాయి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.

* కాకర కాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎ, సి, కె విటమిన్లు ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు, డైటరీ ఫైబర్‌లకు ఇది మంచి మూలం. కాబట్టి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. శరీరంలో నొప్పిని, వాపును తగ్గిస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడం కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరుస్తుంది. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లకు కాకర కాయ మంచిది.


*కాకరకాయలో విటమిన్ సి కూడా ఉండటం మూలంగా ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మొటిమలు, స్కిన్ అలెర్జీలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ మూలంగా కడుపులో ఉబ్బరం, మలబద్ధకం, అధిక బరువు సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి కాకర కాయను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story