Health : ఖాళీ కడుపుతో తేనె, నిమ్మరసం.. ఏం జరుగుతుందో తెలిస్తే అస్సలు వదలరు!

by Javid Pasha |

నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువ. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

Health : ఖాళీ కడుపుతో తేనె, నిమ్మరసం.. ఏం జరుగుతుందో తెలిస్తే అస్సలు వదలరు!
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ సమస్యకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కొన్ని చిన్న చిన్న అనారోగ్యాలకు పరిష్కారం మన ఇండ్లల్లోనే ఉంటాయి అంటున్నారు ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు. అలాంటి వాటిలో తేనె, నిమ్మరసం కూడా ఒకటి. ప్రతిరోజూ లేదా అప్పుడప్పుడైనా సరే ఉదయంపూట ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే లివర్ ఆరోగ్యానికి మంచిదని, ఇది డిటాక్సిఫికేషన్‌కు సహాయపడే సహజమైన చిట్కా అని చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (Journal of Ayurveda and Integrative Medicine)లో పబ్లిషైన గత అధ్యయన వివరాలు సైతం ఇదే పేర్కొన్నాయి. దీనివల్ల ఇంకా ఏయే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

*లివర్ ఆరోగ్యం : నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్స్, అలాగే తేనెలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ పానీయం తాగడంవల్ల లివర్‌ను శుభ్ర పరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఎనర్జీ లెవెల్స్, చర్మంలో నిగారింపు కూడా పెరుగుతాయి.

*హైడ్రేషన్ : గోరు వెచ్చని నీటిలో తేనె + నిమ్మరసం కలపడంవల్ల సాదా నీరు రుచిగా మారుతుంది. రోజంతా ఎక్కువ నీరు తాగే అలవాటు పెరుగుతుంది. ఇది శరీరంలో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు సహాయపడుతుంది.

*విటమిన్ సి & యాంటీఆక్సిడెంట్స్ : నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.

*గొంతులో చికాకు & కఫ్ నుంచి ఉపశమనం: తేనె గొంతు నొప్పి, దగ్గు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక దీనికి తోడు నిమ్మరసం కలిపితే మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. గొంతులో చికాకు, మంట, దగ్గు, కఫ్ వంటి సమస్యలు తొలగుతాయి.

*బరువు నియంత్రణ : ఖాళీ కడుపున తేను, నిమ్మరసం కలిపిన వాటర్ తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు కలిగిన వారికి ఇది మంచి ఉపయోగం. ఇక చిన్న అధ్యయనంలో 4 రోజుల లెమన్ హనీ జ్యూస్ ఫాస్టింగ్ వల్ల బరువు, బీఎంఐ, ఫ్యాట్ మాస్, ట్రైగ్లిసరైడ్స్ తగ్గినట్లు తేలింది. కాబట్టి బరువును కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వారికి ఇది అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు ఆయుర్వేదిక్ సోర్స్ నుంచి సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story