- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలు, పసుపు, నల్ల మిరియాలు.. ఆ సమస్యలకు తక్షణ ఉపశమనం!
పసుపు వంటకాల్లోనే కాకుండా ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగించబడుతోంది.

దిశ, ఫీచర్స్ : కాళ్లు, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయా? జలుబుతో ముక్కు పట్టేసినట్టు ఉందా? అయితే గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు, నల్ల మిరియాల పొడిని కలిసి తాగండి.. తక్షణ ఉపశమనం లభిస్తుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కొన్ని అధ్యయనాలు సైతం ఇదే చెబుతున్నాయి. పసుపులోని కర్క్యుమిన్ (Curcumin) అనే యాక్టివ్ సమ్మేళనం శక్తివంతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటంవల్ల ఇలా జరుగుతుందని పేర్కొన్నాయి. జర్నల్ ఆఫ్ ప్లాంటా మెడిక(Journal of Planta Medica)లో పబ్లిషైన ఒక అధ్యయనం కూడా దీనిని స్పష్టం చేస్తున్నది. కర్క్యుమిన్(పసుపు)తో పాటు 20 mg పిపెరిన్(Piperine- మిరియాల సమ్మేళనం) కలిపి తాగినప్పుడు బయో అవైలబిలిటీ(శోషణ) 20 రెట్లు (2000% ) పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.
నిజానికి పసుపు వేల సంవత్సరాలుగా భారతీయ వంటకాల్లోనే కాకుండా ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగించబడుతోంది. కొన్ని ఆధునిక పరిశోధనలు సైతం ఇప్పటికీ దీని అద్భుతమైన సామర్థ్యాన్ని కనుగొంటున్నాయి. ముఖ్యంగా ఇందులోని కర్క్యుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ నొప్పి నివారణగా పనిచేయడంవల్ల కాళ్లు, కీళ్ల నొప్పు(Arthritis)ల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, మిరియాలపొడి కలిపి తాగాలని పెద్దలు సైతం సూచిస్తుంటారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కీళ్ల ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరంలో వాపు(inflammation)ను నియంత్రిస్తుంది. జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






