ఎనర్జీ వస్తుందని ఆ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి!

by Javid Pasha |

ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ గట్ బ్యాక్టీరియాను దెబ్బతీసి, మైక్రోబయోమ్‌ను అసమతుల్యం చేస్తాయి.

ఎనర్జీ వస్తుందని ఆ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్ : పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌లు, పలు ఇతర ఆటలు ఆడే సందర్భాల్లో చాలా మంది కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. “ఎనర్జీ వస్తుంది, రిఫ్రెష్ అవుతారు” అనే ప్రకటనలు చూసి ఎంతోమంది ఇవి మంచివని నమ్మేస్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఇవి అనారోగ్యానికి కారణం అవుతాయి. వీటిలోని అధిక చక్కెర, కెఫీన్, ఇతర రసాయనాలు దీర్ఘకాలంలో డయాబెటిస్, హృదయ సమస్యలు, ఊబకాయం వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తాయని చెబుతున్నారు. ఏవి ఎలా హాని చేస్తాయో చూద్దాం.

*ఎనర్జీ డ్రింక్స్: అధిక కెఫీన్, స్టిమ్యులంట్స్ కలిగి ఉండటంవల్ల హృదయ స్పందన రేటు పెరిగి, బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. కార్డియోవాస్కులర్ వ్యవస్థపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. రోజూ తాగే అలవాటు ఉంటే నిద్రలేమి, ఆందోళన(Anxiety), హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అంటున్నారు నిపుణులు.

*డైట్ సోడాలు : ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ గట్ బ్యాక్టీరియాను దెబ్బతీసి, మైక్రోబయోమ్‌ను అసమతుల్యం చేస్తాయి. ఫలితంగా చక్కెర ఆకలి (sugar cravings) పెరిగి, దీర్ఘకాలంలో అధిక బరువు పెరుగుతారు. మెటబాలిక్ సమస్యలు ఏర్పడతాయి.

*ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్: ఫ్రూట్ కాన్సంట్రేట్ వల్ల సక్రోజ్ & ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచి, ఇన్సులిన్ స్పైక్స్, ఫ్యాటీ లివర్, అధిక బరువు పెరగడానికి దోహదపడతాయి. ఫైబర్ దాదాపు లేకపోవడం మరొక ప్రధాన సమస్య.

*స్పోర్ట్స్ డ్రింక్స్: ఇవి తీవ్ర వ్యాయామం చేసేవారికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. సాధారణంగా రోజూ లేదా అలవాటుగా తాగితే అధిక చక్కెర, సోడియం వల్ల రక్తపోటు, ఊబకాయం, డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి.

*ఫ్లేవర్డ్ మిల్క్: చాక్లెట్, స్ట్రాబెర్రీ, మాంగో వంటి ఫ్లేవర్డ్ మిల్క్‌లో అధిక చక్కెర ఉంటుంది. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచి, అదనపు క్యాలరీలు ఇచ్చి ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను, డయాబెటిస్ రిస్కును పెంచుతాయి.

* ఏం చేయాలి ? : ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వంటివి తగ్గించడం లేదా అసలే తాగకపోవడం మంచిది. వీటిని తాగాలనిపించిప్పుడు బదులుగా స్వచ్ఛమైన మంచి నీరు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీలు తాగాలని చెబుతున్నారు. అంతేగానీ అధిక చక్కెరలు, హానికరమైన రసాయనాలు కలిగిన పానీయాలను తాగుతూ ఆరోగ్యం పాడుచేసుకోవద్దని సూచిస్తున్నారు.

Next Story