- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిది కాదా? ఇవిగో షాకింగ్ ఫ్యాక్ట్స్..!
ఖాళీ కడుపుతో కాఫీ తాగడంవల్ల ఎనర్జీని ఇస్తుంది. కానీ.. కాలక్రమంలో ఆందోళన, ఒత్తిడి, చేతులు వణకడం లాంటి భావనకు దారితీసే అవకాశం కూడా ఉంది!

దిశ, ఫీచర్స్ : మనలో చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరైతే ఉదయాన్నే బెడ్ కాఫీ కూడా తాగుతుంటారు. అయితే రాత్రి నిద్ర భంగం తర్వాత ఇలా ఖాళీ కడుపుతో తాగడం అస్సలు మంచిది కాదంటున్నాయి పలు అధ్యయనాలు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నాయి. ప్రధానంగా స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నాయి. ఇంకా ఏయే నష్టాలు ఉంటాయో చూద్దాం పదండి!
ఖాళీ కడుపుతో కాఫీ తాగడంవల్ల రోజు ప్రారంభంలో ఎనర్జినీ ఇస్తుంది. కానీ కాలక్రమంలో కాఫీలోని కెఫిన్ అనే పదార్థం కొందరిలో ఆందోళన, (anxiety), చేతులు వణకడం లాంటి భావన(Feeling jittery)కు దారితీస్తుందని, హార్ట్‌రేట్ పెరగడం లేదా తర్వాత ఎనర్జీ క్రాష్ రావడం వంటి అవకాశాలు పెరుగుతాయని 2020లో పబ్లిషైన యూనివర్సిటీ ఆఫ్ బాత్ అధ్యయనాలు పేర్కొన్నాయి. వీటి ప్రకారం.. రాత్రి నిద్ర భంగం (After a night of disturbed sleep) అయిన తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగితే బ్లడ్ షుగర్ రెస్పాన్స్ 50% వరకు పెరిగింది. అంటే ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది మెటబాలిక్ స్ట్రెస్‌ను పెంచుతుంది. ఇందులో కార్టిసాల్ పాత్ర కూడా ఉంటుంది.
ఇతర పరిశోధనలు (Such as the Lovallo study in 2005) కూడా కెఫీన్ స్ట్రెస్ లేదా రెస్ట్ సమయంలో కార్టిసాల్‌ను పెంచుతుందని చూపించాయి. రాత్రి నిద్ర భంగం తర్వాత ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఇది మరింత వేగంగా శోషించబడి ప్రభావం మరింత బలంగా ఉంటుందని పేర్కొన్నాయి. అయితే రెగ్యులర్ కాఫీ డ్రింకర్లలో టాలరెన్స్ ఏర్పడటంవల్ల కార్టిసాల్ రెస్పాన్స్ కొంత తగ్గుతుంది. ఖాళీ కడుపుతో తాగకుండా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తాగితే కార్టిసాల్ స్థాయిలు స్థిరంగా ఉంటాయని, స్ట్రెస్ రెస్పాన్స్ తగ్గుతుందని అధ్యయనాలను చెబుతున్నాయి. అయితే ఇది అందరికీ ఒకేలా వర్తించకపోవచ్చునని, కొందరికి ఎలాంటి సమస్య రాకపోవచ్చునని కూడా అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా ఇప్పటికే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవారికి, తరచుగా బ్లడ్‌షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారికి మాత్రం సమస్యగా మారవచ్చునని అధ్యయనం తెలిపింది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను నిపుణులను సంప్రదించగలరు.






