- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తున్న బ్లాక్ కాఫీ.. కానీ ఆ లిమిట్ దాటొద్దు!
బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఫ్యాటీలివర్ సమ్యను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : కాఫీ ఒక లిమిట్ ప్రకారం తాగితే మంచిదే. కానీ ఎక్కువగా తాగితే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదంటారు నిపుణులు. ఎందుకంటే ఇందులో చక్కెర, పాలు కలుపుతాం కాబట్టి అదనపు కేలరీలు, అదనపు చక్కెరలు ఉంటాయి. అందుకే రోజుకు రెండు లేదా మూడు కప్పులకంటే ఎక్కువగా తాగితే అధిక బరువు, అజీర్తి, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తే చాన్స్ ఉందంటున్నారు హెల్త్‌ఎక్స్‌పర్ట్స్. అయితే దీనికి భిన్నంగా ఎటువంటి పాలు, చక్కెర కలుపకుండా కేవలం బ్లాక్ టీ మాత్రమే తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.
బ్లాక్ కాఫీ తాగడంవల్ల జీవక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీలివర్ సమ్యను కంట్రోల్ చేయడంలో, అధిక కొవ్వువల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ సమస్యను నివారించడంలో కాఫీలోని పోషకాలు సహాయపడతాయని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులోని కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు బాడీలో థర్మోజెనిసిస్ ప్రక్రియను పెంచుతాయి. ఇది కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
పలు అధ్యయనాలు కూడా బ్లాక్ కాఫీలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)ను నివారించే గుణాలున్నాయని తెలిపాయి. అంతేకాకుండా ఇది హై ఫ్యాట్ డిపాజిట్‌ను తగ్గించి మెటబాలిక్ జీవక్రియను సమతుల్యం చేస్తుంది. ఊబకాయం ఉన్న వ్యక్తులలో కొవ్వు శాతాన్ని 10% బర్న్ చేస్తుంది. ఆకలిని అణచివేస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కు సహాయపడుతుంది. లివర్ ఫ్యాట్ అక్యుములేషన్‌ను తగ్గిస్తుంది. ఎంజైమ్ లెవల్స్‌ను మెరుగుపరచడం ద్వారా ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి సమస్యల నుంచి రక్షణ అందిస్తుంది. మోడరేట్ కాఫీ తీసుకోవడం లివర్ హెల్త్‌కు మంచిదని, డిటాక్స్‌ను సహజంగా బూస్ట్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. రోజుకు 3-4 కప్పులు బ్లాక్ కాఫీ తాగడం లివర్ ఫ్యాట్‌ను డిసాల్వ్ చేయడంలో ఎంతో సహాయపడుతుందని చెబుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు నిపుణులను సంప్రదించగలరు.






