టాక్సిక్ పీపుల్‌ను అవాయిడ్ చేయడం.. స్ట్రాంగ్ మెంటాలిటీకి నిదర్శనమంటున్న నిపుణులు!

by Javid Pasha |   (  Updated:2026-02-14 06:35:35  IST  )

ఎవరైనా సరే.. టాక్సిక్ మెంటాలిటీ‌తో మీ శక్తిని, మీ ఎనర్జీని వృథా చేసేలా బిహేవ్ చేస్తుంటే మాత్రం సహించకండి. ఇలాంటి వారిని అవాయిడ్ చేయడం బలహీనత కాదు.. స్వీయ గౌరవానికి నిదర్శనం

టాక్సిక్ పీపుల్‌ను అవాయిడ్ చేయడం.. స్ట్రాంగ్ మెంటాలిటీకి నిదర్శనమంటున్న నిపుణులు!
X

దిశ, ఫీచర్స్ : మనం కొందరిని ఎంత బాగా చూసుకున్నా.. వాళ్లు మాత్రం మనల్ని వ్యతిరేకిస్తుంటారు. మనం కొందరిని ఎంత గౌరవించినా వాళ్లు మాత్రం మనల్ని అవమానించాలనే చూస్తుంటారు. మనం కొందరి అభివృద్ధికి ఎంత సహకరించినా.. వాళ్లు మాత్రం మనల్ని డెవలప్ కాకుండా ఆటంకాలు కల్పిస్తుంటారు. ఇలాంటి వారినే టాక్సిక్ పీపుల్ అంటారు. ఎందుకంటే వారి ఆలోచనలన్నీ అవగాహనా రాహిత్యంతో, మిడిమిడి జ్ఞానంతో, ఓర్వలేని గుణంతో నిండి ఉంటాయి. అలాంటి వారు మనం మంచి చేసినా.. తిరిగి మనకు చెడు చేయాలనే చూస్తుంటారు. ఏమాత్రం చాన్స్ దొరికినా మనకు నష్టం కలిగిస్తుంటారు. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండటం బెటర్ అంటుంటారు పెద్దలు. నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. విషపూరిత మనస్తత్వం కలిగిన వారిని అవాయిడ్ చేయడం.. అవసరమైతే వారితో కాంటాక్ట్‌లో లేకుండా ఉండటం, వాళ్ల మొబైల్ నెంబర్‌ను బ్లాక్ చేయడం వంటివి తప్పేం కాదని చెబుతున్నారు.

టాక్సిక్ మెంటాలిటీ కలిగిన వారు తమ స్వార్థం కోసం ఏదైనా చేయడానికి, ఎన్ని అబద్ధాలైనా ఆడటానికి, ఎన్ని చాడీలైనా చెప్పడానికి వెనుకడారని మానసిక నిపుణుల పరిశీలనల్లో సైతం వెల్లడైంది. అందుకే ఎవరైనా ఆ విధమైన ఉద్దేశంతో, మనస్తత్వంతో మీ శక్తిని, ఎనర్జీని వృథా చేసేలా బిహేవ్ చేస్తుంటే మాత్రం సహించకండి. మర్యాదగా వాస్తవాలు చెప్పి చూడండి అంటున్నారు నిపుణులు. ఇక కొన్నిసార్లు ఇలాంటి వారికి వివరణలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, నిస్సందేహంగా దూరం పెట్టాలని, వారిలో మీకు నచ్చని ప్రవర్తనను, ఆలోచనను వ్యతిరేకించాలని నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఇలాంటి టాక్సిక్ పీపుల్‌ను అవాయిడ్ చేయడం, వాళ్ల నెంబర్లను బ్లాక్ చేయడం మీ బలహీనత కాదు, అది మీ స్వీయ గౌరవానికి, ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం అంటున్నారు నిపుణులు. నిజానికి మానసికంగా బలమైన వ్యక్తులే సంబంధం హానికరంగా మారినప్పుడు ఏ ఏమాత్రం గిల్ట్ లేకుండా, ఏ గొడవా లేకుండా నిశ్శబ్దంగా అలాంటి వారితో దూరంగా ఉంటారని. ఆత్మాభిమానానికీ, స్వీయ-గౌరవానికీ, గుడ్ మెంటాలిటీకి ఇది నిదర్శనమని సైకాలజిస్టులు చెబుతున్నారు.

Viral : అబ్బాయిల కంటే అమ్మాయిలు ప్రేమలో ఎందుకు సెలెక్టివ్‌గా ఉంటారు..!

Next Story