- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral : అబ్బాయిల కంటే అమ్మాయిలు ప్రేమలో ఎందుకు సెలెక్టివ్‌గా ఉంటారు..!
మహిళలకు కూడా పురుషుల పట్ల ఆకర్షణ ఉంటుంది. కానీ వారు కేవలం ఆకర్షణకే పడిపోరు. సారూప్యత, విలువలు, లక్ష్యాలు సరిపోతాయా లేదా అని డీప్‌గా పరిశీలిస్తారు.

దిశ, ఫీచర్స్ : చాలా వరకు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువగా ప్రేమకోసం ఆరాట పడుతుంటారు. త్వరగా ప్రేమలో పడిపోతుంటారు. కానీ.. అమ్మాయిల్లో చాలామంది ఇందుకు భిన్నంగా ఉంటారు. అలాగనీ వారు ప్రమించరని, ప్రేమలో పడరని కాదు కానీ.. అంత ఈజీగా ప్రేమలో పడరు. ఈ విషయంలో చాలా ఆచి తూచి నిర్ణయం తీసుకుంటారని, ప్రేమికుడిని లేదా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో అబ్బాయిలకంటే సెలెక్టివ్‌గాఉంటారని బ్రిటీష్ జర్నల్ఆఫ్ సైకాలజీలో వచ్చిన ఒక అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా తెలివైన మహిళలు ప్రేమ విషయంలో ఎక్కువ కష్టపడతారు. కానీ పర్ఫెక్ట్ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారని స్పష్టం చేస్తున్నది.
హై స్టాండర్స్ కోరుకుంటారు
పురుషులతో పోలిస్తే ప్రేమ విషయంలో మహళలు తెలివిగా ఆలోచిస్తారు. వీరు తాత్కాలిక భావోద్వేగాలు, సౌకర్యం కంటే శాశ్వత జీవన విధానానికి ప్రేమ సెట్ అవుతుందా లేదా అనేది ఎక్కువగా ఆలోచిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండిపెండెన్స్, హై స్టాండర్స్ ఇక్కడ కీ రోల్ పోషిస్తాయి. అందుకే ఎక్కువ తెలివితేటలు ఉన్న మహిళలు ఎక్కువ స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రధానంగా ప్రేమ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. వీరు తమ జీవితానికి అధిక స్థాయి ప్రమాణాల(high standards)ను నిర్ణయించుకుంటారు. అందుకే భాగస్వామిని ఎంచుకోవడంలో చాలా ఎంపికతో (selective) ఉంటారు.
కేవలం ఆకర్షణకు పడిపోరు!
మహిళలకు కూడా పురుషుల పట్ల ఆకర్షణ ఉంటుంది. కానీ వారు కేవలం ఆకర్షణకే పడిపోరు. అనేక విషయాల్లో సారూప్యత (compatibility), విలువలు, లక్ష్యాలు, భవిష్యత్ ఆలోచనలు.. సరిపోతాయా లేదా అని డీప్‌గా పరిశీలిస్తారు. తమ గోల్స్‌తో, విలువలతో సరిపోని సంబంధాల్లో సెటిల్ అవ్వడం అమ్మాయిలకు దాదాపు ఇష్టం ఉండదని అధ్యయనాల్లో వెల్లడైంది.
అన్ని విషయాల్లో జాగ్రత్త పడతారు
అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్త పడతారు. నిజానికి ప్రేమ విషయంలో ఇది వివేచన(Discernment)కు నిదర్శనం అంటున్నారు మానసిక నిపుణులు. జీవితానికి, వ్యక్తిగతానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా, ఆలోచనతో ఎంచుకోవడం ఏమాత్రం లోపం కాదు. అది అవసరం కూడాను. పైగా ఇది స్వీయ గౌరవం (Self-esteem)మే కాకుండా.. స్పష్టమైన ఆలోచనా విధానంగా నిపుణులు పేర్కొంటున్నారు.
ఉద్దేశ పూర్వకంగానే అలా..
ప్రేమించకుండా.. పెళ్లి చేసుకోకుండా ఎంతకాలమైన వేచి ఉండాలనుకుంటారు కానీ.. సరిపోలని వ్యక్తిని ప్రేమించాలని మాత్రం మహిళలు భావించరట. అందుకే తమకు నచ్చని పరిస్థితుల్లో ఉద్దేశ పూర్వకంగానే ప్రేమ, పెళ్లి వంటి విషయాలను అవాయిడ్ చేస్తుంటారు. సరైన వ్యక్తి కోసం సమయం తీసుకోవడం వీరి బలహీనత కాదు. బలం అంటారు నిపుణులు. అంతేకాకుండా మహిళలు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు ప్రేమను లైట్‌గా తీసుకోరు. సదరు వ్యక్తితో లోతైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పర్చుకుంటారు. ఉమ్మడి విలువలు, దీర్ఘకాలిక సామరస్యం కోసం ఎదురు చూస్తారు.






