AI : ఏఐ వల్ల మనుషుల్లో విలువలు నశిస్తాయా..? నిపుణులు చెబుతున్నది ఇదే..

by Javid Pasha |

మానవ శ్రేయస్సుకు ప్రయారిటీ ఇచ్చేలా ఏఐ రోబోట్స్, చాట్ బాట్స్ సహా ఇతర ఏఐ పరికరాల రూపకల్పన ఉండాలనేది సాంకేతిక నిపుణుల సూచిస్తున్నారు.

AI : ఏఐ వల్ల మనుషుల్లో విలువలు నశిస్తాయా..? నిపుణులు చెబుతున్నది ఇదే..
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఐదారేండ్ల కిందట ఎక్కువగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌పైనే ఆధారపడి సమాచార వ్యాప్తి, సమాచార సేకరణ, కంటెంట్ క్రియేటింగ్, రైటింగ్ వంటివి జరిగేవి. కానీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆ పనిని మరింత వేగంగా, సులభంగా చేస్తోంది. చాట్ బాట్‌ల నుంచి రోబోట్‌ల వరకు అన్ని రంగాల్లో ఏఐ ప్రవేశిస్తూ(AI technology) క్యూరియాసిటీని పెంచుతోంది. ఒక విధంగా చెప్పాలంటే.. మానవ శ్రమను, సమయాన్ని ఆదా చేస్తోంది. అదే సందర్భంలో ఈ సాంకేతికతవల్ల కలిగి లాభ నష్టాల గురించి కూడా సోషల్ మీడియా వేదికల్లో డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా మానవ నైపుణ్యాలు, నైతిక విలువలకు ప్రమాదం ఏర్పడుతుందని కొందరు చెబుతుంగా.. అదంతా వినయోగించుకునే తీరునుబట్టి ఉంటుందని మరి కొందరు వాదిస్తున్నారు.

ఇప్పటికే విద్యా, వైద్య, పరిశ్రమ, మీడియా రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతుండగా.. భవిష్యత్‌లో ఇంకా అనేక రంగాల్లోనూ విస్తరించనుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అదే సందర్భంలో ఇది మానవవాళిని ఆలోచనలను, నైపుణ్యాలను పూర్తిగా నియంత్రించే స్థాయికి విస్తరించే ప్రమాదం ఉందని కూడా కొందరు భావిస్తుండగా, చివరికి మనుషుల్లో మంచి, మానవత్వం, నైతిక విలువలు దిగజారడానికి దారితీయవచ్చుననే ఆందోళనలు సైతం పలువురు వ్యక్తం చేస్తున్నారు. కానీ సాంకేతిక నిపుణులు మాత్రం అలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే ఏఐ ఎంత డెవలప్ అయినప్పటికీ అది మానవ నియంత్రణలో శిక్షణ పొందడం ద్వారానే సాధ్యం అవుతుంది. ఆల్గారిథమ్‌లకు అవసరమైన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మానవ విలువలు, నైతిక విలువలు, న్యాయపరమైన అంశాలకు అనుకూలంగా, సానుకూలంగా కూడా ఏఐ మోడల్స్‌ అభివృద్ధి చేసుకోవచ్చు అంటున్నారు సాంకేతిక నిపుణులు.

ఏఐ కూడా మానవ విలువలతో, నైతిక విలువలతో నిరంతరం సమలేఖనం(aligned) చేయపడుతుందని, అవసరమైన విధంగా ఫ్రేమ్ చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా మానవ శ్రేయస్సుకు, భద్రతకు ప్రయారిటినిచ్చే ఏఐ ఫ్రేమ్‌వర్క్‌లను ఇప్పటికే మేధావులు, సాంకేతిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఎంతో పారదర్శకతగా, జవాబుదారీగా ఏఐ సిస్టమ్స్‌ను డెవలప్ చేయాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారు. అలాగే ఏఐ ఆధారిత సాంకేతికతను, రోబోలను, చాట్ బాట్‌లను అభివృద్ధి చేసే క్రమంలో మానుఫక్చరింగ్ కంపెనీలు, సంస్థలు మానవ విలువలతో(Value alignment) కూడినవిగా రూపొందించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

మానవ శ్రేయస్సుకు ప్రయారిటీ ఇచ్చేలా ఏఐ రోబోట్స్, చాట్ బాట్స్ సహా ఇతర ఏఐ పరికరాల రూపకల్పన ఉండాలనేది సాంకేతిక నిపుణుల సూచన. అంతేకాకుండా ఏఐ సిస్టమ్స్‌కు సామాజిక స్పృహతో కూడిన అంశాలు, మంచి , మానవత్వం, మానవ శ్రేయస్సుకు దోహదం చేసే అంశాలపట్ల శిక్షణ ఇవ్వాలి. వాటి పనితీరులో డెసిషన్స్ అండ్ యాక్షన్స్ విషయంలో క్లారిటీగా వ్యవహరించేలా డెవలప్ చేయాలి. అలాంటప్పుడే ఏఐ మానవాళికి ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేతప్ప ఏఐ వల్ల కచ్చితంగా కీడు జరుగుతుందని, మనుషుల్లో మానవత్వం తగ్గేందుకు కారణం అవుతుందని, విలువలు నశిస్తాయని భావించడం మాత్రం చాలా వరకు ఊహాజనితమైందే అంటున్నారు సాంకేతిక నిపుణులు.

Next Story