Technology : ఏఐ అసిస్టెంట్లతో డేటింగ్..! స్వైప్ ఎరా ముగిసిపోతుందా?

by Javid Pasha |

భవిష్యత్ డేటింగ్ యాప్‌లను ఇక మనుషులే స్వయంగా స్వైప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వారి తరపున ఏఐ అసిస్టెంట్లే అన్నీ చేస్తాయి!

Technology : ఏఐ అసిస్టెంట్లతో డేటింగ్..! స్వైప్ ఎరా ముగిసిపోతుందా?
X

దిశ, ఫీచర్స్ : ఉరుకులు.. పరుగుల జీవితంలో సొంత అవసరాల కోసం ఎక్కువ సమయం కేటాయించలేని అనుభవాలు కొందరికి ఎదురవుతుంటాయి. ముఖ్యంగా డేటింగ్ యాప్‌లను స్క్రోల్ చేసే చాన్స్‌ను కోల్పోతున్నట్లు పలువురు టెకీలు పేర్కొంటుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులను అధిగమించడంలోనూ ఆధునిక సాంకేతికత అద్భుతాలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ ఫౌండర్ విట్నీ వోల్ఫ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పర్సనల్ ఏఐ

భవిష్యత్ డేటింగ్ యాప్‌లను ఇక మనుషులే స్వయంగా స్వైప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వారి తరపున ఏఐ అసిస్టెంట్లు ఆ పని చేస్తాయని, యూజర్లకు కావాల్సిన మ్యాచ్‌లను వెతికి పెడతాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఆ విధమైన సాంకేతికత ఇప్పటికే పురోగతిలో ఉందని చెబుతున్నారు. అంటే ఒక వ్యక్తికి చెందిన పర్సనల్ ఏఐ ఆ వ్యక్తి తరపున ఇతర వేలాది ఏఐ‌ అసిస్టెంట్లతో మాట్లాడి కాంపాటిబిలిటీని అధ్యయనం చేసి, ఉత్తమ మ్యాచ్‌లను సైతం షార్ట్‌లిస్ట్ చేసి ఇస్తుంది. సదరు వ్యక్తి చాట్ చేయడానికి ముందే ఈ ప్రక్రియ జరిగిపోతుంది.

ఎండ్‌లెస్ స్వైపింగ్‌కు చెక్..

అధునాతన సాంకేతికత ఎండ్‌లెస్ స్వైపింగ్, అలాగే అసౌకర్యమైన సంభాషణల నుంచి యూజర్లను రక్షిస్తుందని సపోర్టర్లు చెబుతున్నారు. అంటే అల్గారితమ్స్ రహస్యంగా ఎవరెవరితో డేట్ చేయాలో నిర్ణయిస్తాయి. అయితే ఈ టెక్నాలజీ డేటింగ్‌ను మరింత యాంత్రికంగా మార్చేస్తుందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అయినప్పటికీ టెక్నాలజీ అభివృద్ధివైపే కొనసాగుతోంది. బంబుల్ కంపెనీ ఇప్పటికే ‘Bee’ అనే AI డేటింగ్ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టింది. ఇది యూజర్‌కు సంబంధించిన వాల్యూస్, గోల్స్, కమ్యూనికేషన్ స్టైల్స్‌ను అర్థం చేసుకొని మ్యాచ్‌లను సూచిస్తుంది.

Next Story