- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Body fat : బాడీలోని ఆ పార్ట్స్‌పై కొవ్వు పెరిగితే..?
Body fat : బాడీలోని ఆ పార్ట్స్‌పై కొవ్వు పెరిగితే..?

దిశ, ఫీచర్స్ : శరీరంలో కొవ్వు శాతం పెరగడం హానికరమనే విషయం తెలిసిందే. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో ప్రతికూల మార్పులు కూడా బాడీ ఫ్యాట్ పెరగడానికి దారితీస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే తరచుగా శరీరంలోని కొన్ని భాగాల్లోనే కొవ్వు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. అవి ఏ భాగాలు? ఎలాంటి నష్టం జరుగుతుందో చూద్దాం.
ఏయే భాగాల్లో పెరుగుతుంది?
చాలామందికి పొట్ట, నడుము భాగంలోనే కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ బాడీ ఇంటర్నల్ ఫంక్షన్స్ నెమ్మదించేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శారీరక శ్రమ లేకపోవడం, తరచుగా ఒకేచోట కూర్చునే ఉద్యోగాలు చేయడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వంటి శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంటాయి.
కారణాలు
శరీరంలోని ఆయా భాగాల్లో కొవ్వు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, స్వీట్స్, ఆయిలీ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు అందుకు దోహదం చేస్తుంటాయి. జీవన శైలి విషయానికి వస్తే గంటల తరబడి స్క్రీన్లకు అతుక్కుపోవడం, నిద్రలేమి, అతి ఆలోచనలు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం కూడా కారణం అవుతుంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి.
ఏం జరుగుతుంది?
బాడీమొత్తంలో గానీ, శరీరంలోని కొన్ని భాగాల్లో గానీ ఫ్యాట్ పెరగడం మీ ఆరోగ్యాన్ని రిస్కులో పడేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, హార్మోనల్ ఇష్యూస్ దీనివల్లే సంభవిస్తుంటాయి. అంతేకాకుండా రక్తనాళాలు సన్నబడి స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయానికి ప్రధాన కారణం కూడా కొవ్వు పేరుకుపోవడమే. దీనివల్ల గర్భాశయ, రొమ్ము, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటివి సంభవించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
పరిష్కారం ఏమిటి?
శరీరంలో కొవ్వు పెరగకూడదంటే.. శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. ఆహారం విషయానికి వస్తే తక్కువ కేలరీలు కలిగినవి తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే సరిపడా నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల వాటర్ తాగాలి. ఫలితం లేకపోతే వైద్య నిపుణులను సంప్రదించి సలహాలు, సూచనలు పాటించాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






