నిద్రలేమికి ఇంటి చిట్కా.. పుల్లని చెర్రీ జ్యూస్ + మెగ్నీషియం

by Javid Pasha |

పుల్లని చెర్రీ పండ్ల జ్యూస్‌ + మెగ్నీషియం కాంబినేషన్ గాఢమైన నిద్రను ప్రేరేపిస్తుందని 2018లో 50 ఏండ్లు పైబడిన 8 మంది ఇన్సామ్నియా బాధితులపై నిర్వహించిన అధ్యయనం సహా పలు ఇతర అధ్యయనాలు సైతం పేర్కొన్నాయి.

నిద్రలేమికి ఇంటి చిట్కా.. పుల్లని చెర్రీ జ్యూస్ + మెగ్నీషియం
X

దిశ, ఫీచర్స్ : నిద్ర సర్వరోగ నివారిణి అంటుంటారు పెద్దలు. ఎందుకంటే ప్రశాంతమైన నిద్ర మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. నిద్రలేమి మాత్రం అందుకు భిన్నమైన ప్రభావాన్ని చూపుతుంది. సరిగ్గా నిద్రపట్టకపోతే మానసిక ఆందోళనకు, గందరగోళానికి దారితీస్తుంది. అది ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది. ప్రొడక్టివిటీని తగ్గిస్తుంది. అయితే ఈ సమస్యకు ఇంటిలోనే పాటించదగ్గ చక్కటి పరిష్కారం ఉదంటున్నారు నిపుణులు. అదే పుల్లని చెర్రీ పండ్ల జ్యూస్ + మెగ్నీషియం కాంబినేషన్. ఇది ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పుల్లని చెర్రీ (Tart cherry) పండ్ల జ్యూస్‌ + మెగ్నీషియం కాంబినేషన్ గాఢమైన నిద్రను ప్రేరేపిస్తుందని 2018లో 50 ఏండ్లు పైబడిన 8 మంది ఇన్సామ్నియా బాధితులపై నిర్వహించిన అధ్యయనం సహా పలు ఇతర అధ్యయనాలు సైతం పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ జ్యూస్‌లో మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉంటుంది. జ్యూస్ తాగిన తర్వాత అది శరీరానికి “ఇప్పుడు నిద్రపోవాల్సిన సమయం” అన్నట్లుగా నిద్రను ప్రేరేపిస్తుంది. పైగా అందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో ప్రశాంతతకు కారణమయ్యే మెలటోనిన్, సెరటోనిన్ హర్మో్న్లను ఉత్పత్తి చేస్తుంది. దానికి తోడు మెగ్నీషియం జోడిస్తారు కాబట్టి నరాలను శాంతరిచి, కండరాలను రిలాక్స్ చేసి, నిద్రను మెరుగు పరుస్తుంది. నిద్రలేమితో ఇబ్బంది పడేవారు నిద్రపోవడానికి గంట ముందు సుమారు ½ కప్ (100–120 ml) ప్యూర్ టార్ట్ చెర్రీ జ్యూస్‌లో 1 టేబుల్ స్పూన్ మెగ్నీషియం పౌడర్ (Magnesium glycinate or citrate is best) కలిపి తాగొచ్చు.

ముఖ్యమైన ప్రయోజనాలు

*మెరుగైన నిద్ర: పుల్లని చెర్రీ పండ్లలో పాలిఫెనాల్స్, ఆంథోసైనిన్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. పైగా ఇవి సహజమైన మెలటోనిన్‌కు మూలం. ఇది నిద్ర-మేల్కొనే (Sleep-wake cycle) చక్రాన్ని నియంత్రించే హార్మోన్.

*కండరాల పునరుద్ధరణ: టార్ట్ చెర్రీస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ(వాపు నిరోధక) గుణాలు తీవ్రమైన వ్యాయామం తర్వాత కండరాల నొప్పి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

*వాపు, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలు: పుల్లని చెర్రీస్‌లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని, దీర్ఘకాలిక వాపును ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

*కీళ్ల ఆరోగ్యం: ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఆర్థరైటిస్‌తో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడంలో, కండరాల దృఢత్వాన్ని పెంచడంలో, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

Next Story