- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక రక్తపోటును దూరం చేసే సింపుల్ చిట్కా.. ఇసోమెట్రిక్ హ్యాండ్ గ్రిప్ వ్యాయామం..!
ఇసోమెట్రిక్ హ్యాండ్ గ్రిప్‌తో అలా చేయడంవల్ల రక్తపోటు కంట్రోల్లో ఉంటుందని నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : అధిక రక్తపోటు, నరాల బలహీనత, తరచుగా బాడీపెయిన్స్ వంటి సమస్యలు వేధిస్తున్నాయా? మీరు ఇంటిలోనే చేయగల ఒక సింపుల్ ఎక్సర్ సైజ్‌తో వాటిని దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. అదే ఇసోమెట్రిక్ హ్యాండ్ గ్రిప్ వ్యాయామం. ఇంతకీ ఇదెలా చేయాలి? ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇసోమెట్రిక్ హ్యాండ్ గ్రిప్‌ను ఉపయోగించి.. రోజుకు రెండు సార్లు హ్యాండ్ ఎక్సర్‌సైజర్‌ను మధ్యస్థ తీవ్రతతో కొన్ని నిమిషాలు స్క్వీజ్ చేయాలి. ఇలా వారంలో ఐదారుసార్లు చేసినా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఫిట్‌నెస్ & ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా దీనివల్ల సిస్టాలిక్ రక్తపోటు సగటున 7 mmHg వరకు, అలాగే డయాస్టాలిక్ 4 mmHg వరకు తగ్గుతుందని అనేక మెటా-అనాలిసిస్‌లు నిరూపించాయి. అంటే ఇది కొన్ని ప్రథమ దశ రక్తపోటు మందులతో సమానంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఎలా పని చేస్తుంది?
పదేపదే చేయడం వల్ల రక్తనాళాలు మెరుగ్గా విస్తరించడం (డైలేట్), స్పందించడం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వాల్ సిట్స్, ప్లాంక్స్ వంటి ఇతర ఇసోమెట్రిక్ వ్యాయామాల మెకానిజం ఇందులో కూడా ఉందంటున్నారు. అంతేకాకుండా ఇది తక్కువ ప్రయత్నంతో చేయగలిగే సులభమైన వ్యాయామం కూడాను. చౌకైన హ్యాండ్ గ్రిప్పర్ సాయంతో రోజుకు కేవలం కొన్ని నిమిషాలు చేయడం ద్వారా కార్డియోవాస్కులర్ ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయనడానికి లేదు. వ్యక్తి వ్యక్తికి మారవచ్చు.
ప్రధాన ప్రయోజనాలు
*ఇసోమెట్రిక్ హ్యాండ్ గ్రిప్ వ్యాయామంతో సిస్టాలిక్ రక్తపోటు సగటున 5-8 mmHg వరకు, డయాస్టాలిక్ 3-5 mmHg వరకు తగ్గుతుంది. ఇది కొన్ని రక్తపోటు మందులతో సమానమైన ప్రభావం చూపుతుంది.
*రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. ఇవి మెరుగ్గా విస్తరించి (డైలేషన్), స్పందించే సామర్థ్యం పెరుగుతుంది. రక్తప్రసరణను సులభతరం చేస్తుంది.
*కార్డియోవాస్కులర్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. గుండెపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. గుండె కండరాలు బలపడతాయి. గ్రిప్ స్ట్రెంత్, మోజేతులు (Forearm), మొత్తం అప్పర్ బాడీ స్ట్రెంత్ మెరుగుపడుతుంది. రోజుకు 5-10 నిమిషాలు చేసినా చాలు. ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






