నన్ను ఒంటరిగా వదిలేయ్ ప్లీజ్..! బంధాలను బలోపేతం చేస్తున్న ‘Personal Space’

by Javid Pasha |

నలుగురిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఆ క్షణంలో ఏదైనా ఇబ్బందిగా అనిపించ్చు. అలాంటప్పుడు ఏకాంతంగా ఉంటే రిలాక్స్ అవుతామని భావించిప్పుడు వారు కోరుకునే ఏకాంతమే ‘పర్సనల్ స్పేస్’.

నన్ను ఒంటరిగా వదిలేయ్ ప్లీజ్..! బంధాలను బలోపేతం చేస్తున్న ‘Personal Space’
X

దిశ, ఫీచర్స్ : ‘I NEED PERSONAL SPACE ’.. ఈ మాట మీరు వినడమో, అనడమో ఎప్పుడైనా చేశారా..? ఎందుకంటే ఇప్పుడిది వ్యక్తిగత సౌకర్యాన్ని కల్పించే పాపులర్ వర్డ్‌గా మారిపోయింది. ఒక వ్యక్తి నలుగురిలో ఉన్నప్పుడో లేదా తన భాగస్వామితో, స్నేహితులతో కలిసి ఉన్నప్పుడో ఆ క్షణంలో ఏదైనా ఇబ్బందిగా అనిపించ్చు. తాను కాసేపు ఏకాంతంగా ఉంటే రిలాక్స్ అవుతానని భావించవచ్చు. అలాంటప్పుడు కోరుకునేదే ‘పర్సనల్ స్పేస్’. అంటే తాము రిలాక్స్‌గా గడిపేందుకు ఏకాంతం కావాలని కోరుకోవడమే దీని ఉద్దేశం అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకునే వారు కాదు. ఈరోజుల్లో మాత్రం అందరూ పర్సనల్ స్పేస్ కోరుకోవడం, కోరుకునే వారికి అవకాశం ఇవ్వడం, గౌరవించడం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వాముల మధ్య ‘పర్సనల్ స్పేస్’ ప్రయారిటీ సంతరించుకుంటోంది.

‘నేనిప్పుడు నీతో మాట్లాడలేను ‘I need personal space’. కాసేపు డిస్టర్బ్ చేయకండి. ఒంటరిగా వదిలేయండి’’ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు భాగస్వామి నోటి నుంచి ఈ మాట వెలువడితే.. ఒకప్పుడు అనుమానంగా చూసేవారు. భార్య భర్తల మధ్య రహస్యాలేం ఉంటాయని భావించేవారు. కానీ ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకునే తీరు మారిందంటున్నారు నిపుణులు. ఇలాంటప్పుడే అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించడం సంబంధాన్ని బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చదువు, కెరీర్, కుటుంబ సమస్యలు వంటి కారణాలతో మానసిక ఒత్తిళ్లు సహజమైపోతున్నాయి. అలాంటప్పుడు భార్యా భర్తలైనా, ప్రేమికులైనా సంబంధంలో, ఇంకే రకమైన సంబంధమైనా పర్సనల్ స్పేస్ (Personal space) కోరుకోవడం సహజమైన విషయంగా అందరూ అంగీకరిస్తున్నారు. పైగా ఇది సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని నిపుణులు అంటున్నారు. దటీజ్ పర్సనల్ స్పేస్.

Next Story