- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైండ్‌లెస్ మంచింగ్ వద్దు.. మైండ్‌ఫుల్‌నెస్ ముద్దు.. జెన్ Z స్నాకింగ్ ట్రెండ్!
జెన్‌జీల ఈటింగ్ ట్రెండ్ మారుతోంది. మైండ్‌లెస్‌మంచింగ్‌కు బదులు మైండ్‌ఫుల్ ఎంపికలపై మొగ్గు చూపుతోంది.

దిశ, ఫీచర్స్ : బోర్ కొడుతున్నప్పుడో, బయటకు వెళ్లినప్పుడో, టేస్టీగా ఉంటుందనో స్నాక్స్ తినాలనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ ఇటీవల యువతలో ఈ ఆలోచన మారుతోంది. జెన్‌జీలు(Gen Z) ఇప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రతీ స్నాక్ శరీరానికి ఇంధనం ఇవ్వాలని ఆలోచించి ఎంచుకుంటున్నది. ఎందుకీ మార్పు? దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందామా!
మైండ్‌ఫుల్‌నెస్‌కు ప్రాధాన్యం
జెన్‌జీల ఈటింగ్ ట్రెండ్ మారుతోంది. మైండ్‌లెస్‌మంచింగ్‌కు బదులు మైండ్‌ఫుల్ ఎంపికలపై మొగ్గు చూపుతోంది. మైండ్ లెస్ మంచింగ్ అంటే.. ఏదో ఒకటి నెమ్మదిగా, ఆనందంగా, ఆలోచన లేకుండా తినడమని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు.. టీవీ చూస్తూ, ఫోన్ స్క్రోల్ చేస్తూ, బోర్ కొడుతున్నప్పుడు చిప్స్, బిస్కెట్లు, నట్స్ వంటివి నెమ్మదిగా తినడం. ఇది ఆకలి కోసం కాకుండా, అలవాటు లేదా టైం పాస్ చేస్తారు. ఇదే అనారోగ్యానికి దారితీస్తుంది. కానీ జెన్‌జీలు ఇప్పుడు దీనిని వదులుకుంటున్నారు. మైండ్‌ఫుల్‌నెస్‌కు అంటే.. అర్థవంతమైన, పోషకాలతో కూడిన స్నాక్స్‌ను ఇష్టపడుతున్నారు.
రుచి కాదు.. హెల్త్ ముఖ్యం
ముఖ్యంగా హై ప్రోటీన్, లో సుగర్, ప్లాంట్ బేస్డ్ స్నాక్స్ ఇష్టపడే యువతీ యువకులు ఇటీవల పెరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు రోస్టెడ్ నట్స్, మకానా, ప్రోటీన్ బైట్స్, క్లీన్ లేబుల్ చిప్స్ వంటివి తరచుగా తింటున్నారు. ఇక కల్తీ వషయంలోనూ ఈ జనరేషన్ రాజీపడట్లేదు. ఒకప్పుడు నోటికి రుచిగా అనిపిస్తే కొనేసేది. కానీ ఇటీవల యువతీ యువకులు ప్యాకెట్ మీద ఉన్న లేబుల్ చాలా జాగ్రత్తగా చదువుతున్నారు. ఏదైనా ఆర్టిఫిషియల్ కలర్స్ లేదా అనవసరమైన కెమికల్స్ ఉంటే వెంటనే వదిలేస్తున్నారు. సులువుగా అర్థమయ్యే ఇంగ్రిడియంట్స్ ఉన్న స్నాక్స్‌నే ఇష్టపడుతున్నారు.
గిల్ట్ ఫ్రీ, హెల్తీ హాబిట్స్
మిలీనియల్స్‌తో పోలిస్తే జెన్‌జీలు వేగవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాలేజీలకో, ఉద్యోగాలకో వెళ్లాల్సిన హడావిడిలో ఉంటారు. కాబట్టి త్వరగా తినగలిగే, పోర్టబుల్ స్నాక్స్ తమకు సరిపోతాయని భావిస్తున్నారు చాలామంది. కొందరైతే సోషల్ మీడియాలో ఫిట్‌నెస్ వీడియోలు చూసి కొత్త కొత్త హెల్తీ స్నాక్ ఆప్షన్లు కనుగొంటున్నారు. ఇలా స్నాకింగ్‌ను గిల్ట్ ఫ్రీ, హెల్తీ అలవాటుగా మార్చడం జెన్ Zలో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఫైనల్‌గా హెల్తీ స్నాక్స్ ఎంచుకోవడమనేది జెన్ జీలలో వచ్చిన మార్పు. ఇది వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.






