- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Financial stress : ఫైనాన్షియల్ స్ట్రెస్‌తో నిద్రలేమి.. అర్ధరాత్రి ఆ ఆలోచనలతో 350% పెరుగుతున్న రిస్క్ !
ఫైనాన్షియల్ స్ట్రెస్ కేవలం అధిక ఆదాయంలేకపోవడం వల్ల మాత్రమే తలెత్తదు. ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల కూడా తలెత్తుతుంది.

దిశ, ఫీచర్స్ : ఒత్తిడి అనేక రూపాలు.. ముఖ్యంగా మానసిక ఒత్తిడి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఫైనాన్షియల్ స్ట్రెస్ మాత్రం మరింత ప్రమాదకరమని ‘జర్నల్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ (Journal of Consumer Affairs) నుంచి వచ్చిన ఒక అధ్యయనం పేర్కొన్నది. ఇది కేవలం ఆర్థిక స్థితిని మాత్రమే కాకుండా, 350% నిద్రలేమి సమస్యను పెంచుతుందని వెల్లడించింది. ఆర్థిక సమస్యలు అందరికీ ఉంటాయి. అయితే అవి పరిష్కరించుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పుడు సమస్య ఉండదు. కానీ ఆ పరిధి దాటితే మాత్రం మనిషిని కృంగదీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాగా హెల్త్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్థిక ఒత్తిడి.. ఇది పైకి కనిపించదు కానీ.. మనిషిని నిలువెల్లా దహించే అగ్ని వంటిది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తీర్చాల్సిన అప్పులు, కట్టాల్సిన బిల్లులు, కుటుంబ ఆర్థిక అవసరాలు వంటి ఆలోచనలు అర్ధరాత్రిళ్లు దాడిచేస్తూ ప్రతికూల ఆలోచనలకు కారణం అవుతాయి. ఇక ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి బాధిత వ్యక్తి పోరాటం లేదా పలాయనం (Fight or flight) స్థితిలో ఉండిపోవడంవల్ల నిద్ర పట్టదు. ఇది కూడా తీవ్రమైన నిద్రలేమికి తద్వారా ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.
ఫైనాన్షియల్ స్ట్రెస్ (Financial stress) కేవలం అధిక ఆదాయంలేకపోవడం వల్ల మాత్రమే తలెత్తదు అంటున్నారు. ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల, తమ ఆర్థిక పరిస్థితులు, అవసరాలను పట్టించుకోకుండా, ఇతరుల మాదిరి జీవించాలనే భ్రమ వల్ల, విచ్ఛాల విడి ఖర్చువల్ల, ఖర్చు చేసిన తర్వాత తరచుగా బ్యాలెన్స్ చెక్ చేసి బాధపడే అలవాటువల్ల, క్రిడిట్ కార్డులను దుర్వినియోగం చేయడంవల్ల ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీ ఆర్థిక ఒత్తిడికి కారణమైన పరిస్థితులను పరిశీలించి నివారించుకోవడమే చక్కటి పరిష్కారమని చెబుతున్నారు. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలనిర సూచిస్తున్నారు.






