- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Lucid dreams : కలల గురించి భిన్న ధోరణులు.. వాంటెడ్లీ కూడా అందమైన కలలను కనొచ్చు..!
Lucid dreams : కలల గురించి భిన్న ధోరణులు.. వాంటెడ్లీ కూడా అందమైన కలలను కనొచ్చు..!

దిశ, ఫీచర్స్ : మంచివో, చెడ్డవో.. ఆనందాన్ని కలిగించేవో, బాధకు గురిచేసేవో.. ఏవైతేనేం.. ప్రతి ఒక్కరూ గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో కలగనే ఉంటారు. కొన్నిసార్లు అందమైన కలలు మనల్ని అలరిస్తే.. మరికొన్నిసార్లు భయానకమైన కలలు ఆందోళన కలిగిస్తుంటాయి. అయితే కలల గురించి సమాజంలో పలు ధోరణులు ప్రచారంలో ఉన్నాయి. వీటిని ఆధ్యాత్మికతతో, దుష్ట శక్తులతో, మంచి, చెడు శకునాలతో కూడా ముడిపడి అభివర్ణిస్తుంటారు. వచ్చిన కలను బట్టి మంచి లేదా కీడు జరగొచ్చని అనుమానిస్తుంటారు. అయితే అవన్నీ నమ్మకాలపై, వ్యక్తుల అవగాహపై కూడా ఆధారపడి ఉంటుంది. కానీ శాస్త్రీయ అవగాహన వేరు.
కలలు.. వాటి పట్ల ఉన్న భిన్న నమ్మకాలను పక్కన పెడితే.. సైంటిఫిక్‌గా ఆలోచించినప్పుడు అవి కేవలం ఆధ్యాత్మిక ధోరణి కాదు. శాస్త్రీయంగా నిరూపితమైన మెదడు నైపుణ్యం కూడా. అయితే దీనిపై పరిశోధనలు పలు కోణాల్లో సమాచారాన్ని అందించినప్పటికీ, కలలు రావడానికి పూర్తి కచ్చితనమైన కారణాలపై సైన్స్ కూడా ఇంకా పూర్తిస్థాయి అవగాహనకు రాలేదు. కాకపోతే.. కలలు మెదడుకు సంబంధించిన సమచార ప్రాసెసింగ్, జ్ఞాపక శక్తి ఏకీకరణ(Memory consolidation), భావోద్వేగ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయనేది పరిశోధనలు పేర్కొంటున్నాయి. నిద్ర వేళలో రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (REM) దశలో కలలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతున్నాయి. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అండ్ లింబిక్ సిస్టమ్ యాక్టివేషన్ ద్వారా ఇవి వస్తుంటాయి. అంటే ఈ ప్రాసెస్‌లో రోజువారీ అనుభవాలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు ప్రాసెస్ చేయబడతాయి. ఇవి కలలు రూపంలో వ్యక్తం అవుతాయి.
స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్, అలాగే మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రముఖ సంస్థల పరిశోధకుల పరిశోధకుల ప్రకారం.. కలలు కనడమనేది మానవ జీవన అనుభవాలతో ముడిపిడి ఉంటుంది. స్పష్టమైన కలలు కనడమనేది ఒనిరాలజీ అండ్ న్యూరోసైన్స్‌కు సంబంధించిన సైకలాజికల్ కేటగిరిలో(psychological subfield of oneirology and neuroscience) ఒక భాగం. స్థిరమైన పద్ధతుల ద్వారా మన మెదడు కలలో ఉన్నప్పుడు దానిని గుర్తించి, కలను కంట్రోల్ చేయగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయవచ్చునని పరిశోధకులు నిరూపించారు. దీనిని లూసిడ్ డ్రీమింగ్ ప్రాసెస్ అని పిలుస్తున్నారు.
లూసిండ్ డ్రీమింగ్ ప్రాసెస్ ప్రకారం.. ప్రధానంగా నిద్రకు సంబంధించిన REM (రాపిడ్ ఐ మూవ్‌మెంట్) దశలో జరిగే మెదడు కార్యకలాపాలవల్ల కలలు వస్తాయి. FMRI (ఫంక్షనల్ మాగ్నెటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్), EEG (ఎలెక్ట్రోఎన్సెఫలోగ్రఫీ) వంటి సాంకేతికతల ద్వారా ఈ లూసిడ్ డ్రీమింగ్ సమయంలో తార్కికత, నిర్ణయాధికారం, స్వీయ-అవగాహనకు బాధ్యత వహించే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏరియా యాక్టివేట్ అవుతుందని, ఇది కలలో స్పృహతో కూడిన నియంత్రణను సాధ్యం చేస్తుందని పరిశోధన చూపించింది. ఈ అయితే ఈ లూసిడ్ డ్రీమింగ్ సాధించడానికి ప్రత్యేక శిక్షణ అవసరం. ప్రతి ఉదయం కలల జర్నల్ రాయడం, వేక్ బ్యాక్ టు బెడ్ పద్ధతి, మెమోనిక్ ఇంజక్షన్ వంటి పద్ధతలు ద్వారా కలలను తిరిగి ప్రాసెస్ చేయడం, కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుంది. Link






