- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : మీరు బతికే ఉన్నారా..? రెండు రోజులకోసారి ట్యాప్ చేయకపోతే ఈ యాప్ అలర్ట్ పంపిస్తుంది!
ఒకవేళ రెండు రోజులపాటు చెక్-ఇన్ చేయకపోతే ఈ యాప్ మీ ఫోన్ కాంటాక్ట్స్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ పంపుతుంది!

దిశ, ఫీచర్స్ : మీరు ఒంటరిగా నివసిస్తున్నారా? కుటుంబానికి దూరంగా ఉంటున్నారా? వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారా? మీరు యాపిల్ ఫోన్ యూజర్లు అయితే గనుక ‘Are You Dead? లేదా Demumu’ యాప్ డౌన్‌లో చేసుకోండి! మనసు నిబ్బరంగా ఉంటుంది అంటున్నారు చైనీస్ సాంకేతిక నిపుణులు. ఎందుకంటే మీరు కాల్స్ మాట్లాడలేని, మెసెజ్ చేయలేని, పైకిలేవలేని పరిస్థితుల్లో ఉంటే ఈ యాప్ మీ ఫోన్ కాంటాక్ట్స్ అన్నింటికీ ఆటోమేటిగ్గా ఎమర్జెన్సీ అలర్ట్ పంపుతుంది. అప్పుడు మీ స్నేహితులో, సన్నిహితులో, కుటుంబ సభ్యులో వచ్చి మీ బాగోగులు చూసుకుంటారు! ఇప్పటికే ఆపిల్ యాప్ స్టోర్‌లోని పెయిడ్ యాప్‌ల ర్యాకింగ్‌లో ఇది మొదటిస్థానంలో ఉంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ప్రయోజనాలు ఏమిటి? తదితర వివరాలు చూద్దాం పదండి!
మీరు చనిపోయారా? (Are You Dead?) ఈ పేరు వినడానికి కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుందేమో కానీ.. యాప్ బెనిఫిట్స్ మాత్రం అదుర్స్ అంటున్నారు నిపుణులు. ఇక దీని వినియోగానికి వస్తే.. ఒంటరిగా ఉంటున్న వారు ప్రతీ రెండు రోజులకు ఒకసారి బటన్‌ను ట్యాప్ చేస్తూ ఉండాలి. దీంతో అది మీరు క్షేమంగాను ఉన్నారని, బతికే ఉన్నారని గ్రహిస్తుంది. ఒకవేళ రెండు రోజులపాటు ఈ విధంగా చెక్-ఇన్ చేయకపోతే.. వెంటనే ఈ యాప్ ఆటోమేటిగ్గా మీరు దానిని ఎనేబుల్ చేసినప్పుడు ఎంచుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు ఇ-మెయిల్ ద్వారా అలర్ట్ పంపుతుంది. ఇది ఏకాంత జీవితం గడుపుతున్న వారికి భద్రతా భావనను కలిగించే లక్ష్యంతో రూపొందించబడిందని సాంకేతిక నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా ఒంటరిగా జీవిస్తున్న యువత, రిమోట్‌గా పని చేసేవారు, వృద్ధులు వంటి వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ‘Demumu’ యాప్‌ను డెవలప్ చేసినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చైనాలో దీని అవసరం పెరుగుతున్నదని, భవిష్యత్తులో మరింత విస్తరించనుందని అంటున్నారు. ఎందుకంటే 2030 నాటికి ఈ దేశంలో ఒంటరితనం ఎక్కువగా పెరగనుందనే అంచనాలు ఉన్నాయి. ఎవరూ తోడు లేకుండా ఒక్కరే నివసించేవారు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తమను ఎవరూ గుర్తించకపోతే ప్రాణాలకు ముప్పు సంభవించవచ్చు. అలాంటప్పుడు ఈ సరికొత్త యాప్ ఫోన్ లిస్టులోని ఎమెర్జెన్సీ కాంటాక్ట్స్‌కు అలర్ట్ పంపుతుంది. కాబట్టి ఎవరైనా స్పందించి ఆపదలో ఆదుకుంటారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌గా యాపిల్ యాప్ స్టోర్‌లో ఇది ‘‘Demumu’’ పేరుతో అందుబాటులో ఉంది.






