Technology : నియర్ ఫీల్డ్ మైక్రోచిప్స్.. అతి చిన్న సాంకేతిక పరికరాలదే భవిష్యత్తు అంటున్న నిపుణులు!

by Javid Pasha |

నియర్ ఫీల్డ్ మైక్రో చిప్ అంటే అత్యంత చిన్న సైజులో ఉన్న కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్ అనుకోవచ్చు. మీకు నచ్చిన డేటాతో కూడిన మైక్రో చిప్‌ను స్టిక్కర్ రూపంలో మీ షర్ట్ బటన్‌పై గానీ, మనీపర్స్‌పై గానీ, హ్యాండ్ బ్యాగ్‌పైగానీ ఫిక్స్ చేసుకోవచ్చు.

Technology : నియర్ ఫీల్డ్ మైక్రోచిప్స్.. అతి చిన్న సాంకేతిక పరికరాలదే భవిష్యత్తు అంటున్న నిపుణులు!
X

దిశ,ఫీచర్స్ : ప్రస్తుతం ప్రతీ అవసరానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏదో ఒక రూపంలో ఉపయోగించుకుంటున్నాం. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఇది మరింత సులువైపోయింది. చిన్న చిన్న లావాదేవీలు మొదలు కొని పెద్ద పెద్ద వ్యాపారాల వరకు చెల్లింపులు, లెక్కింపులు వంటి విషయాల్లో మోడర్న్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వివిధ యూపీఐ సర్వీసులకోసం, ఆన్‌లైన్ పేమెంట్ల కోసం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, స్వైపింగ్ మెషిన్లు, క్యూఆర్ కోడ్‌ల స్కానింగ్ సాంతికేతికతపై ఆధారపడుతున్నాం. అయితే ప్రస్తుతం వీటికి మించిన వెరీ స్మాల్ స్మార్ట్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తున్నది. భవిష్యత్తులో మరింత విస్తరించనుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. దానినే ‘నియర్ ఫీల్డ్ మైక్రో చిప్’గా పేర్కొంటున్నారు.

ఉపయోగాలేమిటి?

నియర్ ఫీల్డ్ మైక్రో చిప్ అంటే అత్యంత చిన్న సైజులో ఉన్న కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్ ఏదైనా రూపంలో ఉండవచ్చు. మీకు నచ్చిన డేటాతో కూడిన మైక్రో చిప్‌ను స్టిక్కర్ రూపంలో మీ షర్ట్ బటన్‌పై గానీ, మనీపర్స్‌పై గానీ, హ్యాండ్ బ్యాగ్‌పైగానీ ఉంచుకోవచ్చు. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, యూపీఐ క్యూఆర్ కోడ్‌లకు ప్రత్యామ్నాయంగానే వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే స్వీడన్, చైనా వంటి దేశాలు దీనిని డెవలప్ చేసి ఉపయోగిస్తున్నాయి. కానీ విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. కాకపోతే భవిష్యత్తులో ఈ సాంకేతికతకే డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు?

ఎలా పనిచేస్తాయి?

ఒక విధంగా ఇది నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీపై ఆధారపడిన చిన్న చిప్స్ అని చెప్పవచ్చు. అంటే ఇవి రెండు ఎలక్ట్రానిక్ డివైస్‌ల మధ్య చాలా దగ్గరి దూరంలో (సాధారణంగా 4 సెంటీమీటర్ల లోపు) వైర్‌లెస్‌గా డేటాను ఎక్స్ఛేంజ్ చేస్తాయి. ఈ చిప్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగించుకుంటాయి. ఇందులో రీడర్ అండ్ ట్యాగ్ మధ్య టూ-వే కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు, కార్డులు, ఇతర డివైస్‌లలో ఎంబెడ్ చేయబడిన ఈ చిప్స్, డేటాను సురక్షితంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఇండక్టివ్ కప్లింగ్ ద్వారా పనిచేస్తాయి. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్‌లలో Apple Pay, Google Pay, Samsung Pay వంటి యాప్‌ల ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌కు ఉపయోగిస్తున్నారు. రిటైల్, ట్రాన్స్‌పోర్టేషన్, హెల్త్‌కేర్, మార్కెటింగ్ రంగాల్లో వీటిని ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు, ఉదాహరణకు టికెటింగ్ సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్ (డోర్ లాక్స్), లాయల్టీ ప్రోగ్రామ్స్, ప్రొడక్ట్ ట్రాకింగ్‌లలోనూ యూజ్ అవుతున్నాయి.

ఈజీ యాక్సెస్

నియర్ ఫీల్డ్ మైక్రోచిప్‌లను జస్ట్ మీ చేతివేళ్లపైనో, గోర్లపైనో, షర్ట్ బటన్లపైనో, డెస్క్ బోర్డులపైనో ఇలా ఎక్కడైనా అతికించుకోవచ్చు. అవసరమైనప్పుడు వీటి ద్వారా ఇతరులకు ఆన్‌లైన్ పేమెంట్లు చేయవచ్చు. ఇతరులు కూడా మీకు చేయవచ్చు. మీరు ఉపయోగించే మైక్రో చిప్ టైప్‌ను బట్టి అందులో మీ వర్క్ డేటా, ఇంకా ఏవిధమైన సమాచారన్నైనా భద్ర పర్చుకొని యాక్సెస్ చేసుకునేందుకు వీలుటుంది. అలాగే పేమెంట్లు, వివిధ సేవారంగాల్లోనూ నియర్ ఫీల్డ్ మైక్రో చిప్స్ యూజ్ అవుతాయి. జిమ్ సెంటర్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, బస్సులు, కార్లు ఇలా ఎక్కడైనా డోర్లపై లేదా ప్రత్యేక ప్లేస్ కేటాయించి అక్కడ వీటిని అతికించుకొని వినియోగించుకోవచ్చు. పేమెంట్లు చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి, డోర్లు లాక్ చేయడానికి, ఓపెన్ చేయడానికి, ఆ ఏరియాలో అందుతున్న సేవలను తెలుసుకోవడానికి ఇలా ఒకటీ రెండు కాదు. ఇంకా అనేక విషయాల్లో సేవలను, సర్వీసులను వినియోగించుకోవడానికి భవిష్యత్తులో నియర్ ఫీల్డ్ మైక్రో చిప్‌‌లే కీలకం కానున్నాయని నిపుణులు అంటున్నారు.

Next Story