- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీర్ఘకాలిక నిద్రలేమి.. ఎన్ని సమస్యలకు దారితీస్తుందో తెలుసా?
నిద్రలేమి వల్ల ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ పెరుగుతుంది. లెప్టిన్ హార్మోన్ తగ్గుతుంది!

దిశ, ఫీచర్స్ : అనారోగ్యాలకు దారితీసే జీవనశైలి సంబంధిత ప్రధాన కారణాల్లో నిద్రలేమి లేదా నిద్రలోపం కూడా ఒకటి. ఎప్పుడైతే ఎక్కువరోజులు నాణ్యమైన నిద్రను కోల్పోతారో అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వెంటాడం ప్రారంభిస్తాయి. ఇలాంటప్పుడు తలెత్తే అనారోగ్యాలను కేవలం మందులు, పోషకాహారాల ద్వారా మాత్రమే సరిచేయలేవని, నాణ్యమైన నిద్ర, విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఇక్కడ కీలకపాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
శరీరంలో జరిగే మార్పులు
నిద్రలేమి వల్ల ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ పెరుగుతుందని, కడుపు నిండిన భావన కలిగించే లెప్టిన్ హార్మోన్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా హై కేలరీ, ఫ్యాట్, స్వీట్ ఫుడ్స్ పట్ల కోరికలు పెరుగుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి, బ్లడ్ షుగర్ నియంత్రణ కష్టమవుతుంది. కార్టిసాల్ పెరిగి, బెల్లీ ఫ్యాట్ పెరగడానికి దారితీస్తుంది. కండరాల రికవరీ, ప్రోటీన్ సింథెసిస్, గ్రోత్ హార్మోన్ విడుదల తగ్గుతాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి IL-6, CRP వంటి మార్కర్లు పెరుగుతాయి.
ఈ అనారోగ్యాలు కూడా..
నెలల తరబడి తక్కువ నిద్రపోతూ ఉంటే.. క్రమంగా ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, హార్ట్ డిసీజ్, మెటాబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పోషకాహారం, వ్యాయామం ముఖ్యమే కానీ, నిద్ర ఆ రెండింటినీ సక్రమంగా పని చేయడానికి అవసరమైన బయోలాజికల్ ఫౌండేషన్. కాబట్టి, రోజుకు తగినంత నిద్రపోవడం ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమని చెబుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






