AI memes : హాస్యంలోనూ అద్భుతమే.. మనుషులను మించిపోతున్న ఏఐ!

by Javid Pasha |

AI memes : హాస్యంలోనూ అద్భుతమే.. మనుషులను మించిపోతున్న ఏఐ!

AI memes : హాస్యంలోనూ అద్భుతమే.. మనుషులను మించిపోతున్న ఏఐ!
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఎన్ని అద్భుతాలు చేస్తున్నదో తెలిసిన విషయమే. దీని ప్రవేశంతో వివిధ పనులు, డేటా ఎనలైజింగ్ సులభతరం అవుతోంది. భవిష్యత్తులో దీని అవసరం మరింత పెరగొచ్చు. ముఖ్యంగా క్రియేటివ్ సెక్టార్‌లో, ఎంటర్టైన్మెంట్ రంగంలో మనుషులకంటే బెటర్‌గా హాస్యాన్ని పండించగలదని, మీమ్స్(Memes) క్రియేట్ చేయగలదని తాజా అధ్యయనం పేర్కొన్నది.

అధ్యయనంలో భాగంగా స్వీడన్‌లోని కేటీహెచ్ (Kungliga Tekniska Hogskolan ) రాయల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు మీమ్స్ క్రియేట్ చేయడంలో ఏఐ పనితీరును పరిశీలించారు. అయితే ప్రధానంగా వీరి ముఖ్య లక్ష్యం లార్జ్ లాంగ్ మోడల్స్‌ కోసం క్రియేటివ్ సామర్థ్యాలను పరీక్షించడం(Testing co-creative abilities), అంటే ఏఐ మనుషులతో కలిసి సృజనాత్మక పనుల్లో ఎలా సహాయపడుతుందో అన్వేషించడం. కాగా స్టడీలో భాగంగా హాస్యం, సాంస్కృతిక సూచనలు, సరళమైన ఫార్మాట్‌ను కలిగిన మీమ్‌లను తయారు చేసేందుకు పరిశోధకులు 124 మందితో రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ స్వతంత్రంగా పనిచేయగా, మరొక గ్రూప్ ఏఐ చాట్ బాట్ సహాయంతో పనిచేసింది. మొత్తంగా టెక్నాలజీ వినియోగించని వారి గ్రూపువారు 355 మీమ్‌లను క్రియేట్ చేయగా, ఏఐ చాట్‌బాట్‌ సహాయాన్ని తీసుకున్న గ్రూపునకు చెందిన వారు 450కి పైగా మీమ్‌లను క్రియేట్ చేశారు. పైగా ఏఐ ఆధారిత మీమ్స్, మానవులు సృష్టించిన మీమ్స్ కంటే అధిక హాస్యం, క్రియేటివిటీని కలిగి ఉన్నాయని నిపుణులు

Next Story